Wednesday, 29 July 2026 05:32:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా, IAS గారి అధ్వర్యంలో అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్

Date : 07 March 2024 04:08 PM Views : 665

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి ,07.03.02024, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా, IAS గారి అధ్వర్యంలో, ఈరోజు రాష్ట్ర వ్యాప్త మాక్ డ్రిల్ లో బాగంగా తిరుపతి జిల్లా కరకంబాడిలో గల అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ పరిశ్రమ లో ఉదయం 09 గంటల నుంచి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు మరియు Dy. Chief Inspector of factories రామక్రిష్నా రెడ్డి గారి సహకారంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగినది. సాదరణంగా పరిశ్రమలలో వచ్చే అనేక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి, ఉద్యోగల సంసిద్దత మరియు తరలింపు పరిస్థితులను పరీక్షించడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.ఇందులో బాగంగా ఈ రోజు అమర రాజా ఫ్యాక్టరీలో అసిటిలీన్ గ్యాస్ లీకేజ్ పైన మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగినది. ఈ మాక్ డ్రిల్ లో అబ్సర్వెర్ లు గా Hindustan Coca cola, Electro steel casting ltd మరియు Carriage repair shop south central railway పరిశ్రమల భద్రతా అదికారులు పాల్గొని వారి సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగినది. ఈ మాక్ డ్రిల్ తరువాత జరిగిన సమీక్షా సమావేశం లో కూలంకషంగా చర్చించి ప్రతి అధికారి డ్రిల్ చేసిన తీరును అభినందిస్తూ పలు సూచనలు మరియు సలహాలు కూడా అందించడం జరిగినది. ఈ సూచనలని మరియు సలహాలని తప్పని సరిగా పాటిస్తామని అమర రాజా ఎనర్జీ & మొబిలిటి భద్రాతా విభాగం డా. సురేష్ మరియు సురేష్ రెడ్డి గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో DCIF రామక్రిష్నా రెడ్డి గారు మాట్లాడుతూ "ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా పరిశ్రమలలో జరిగే అత్యవసర పరిస్తితులను ఎదుర్కొండానికి, సంసిద్దతను నెమరు వేసుకొనడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వార అత్య్వసర పరిస్థితుల నుంచి ఉద్యోగులను కాపాడుకోవడానికి అవకాసం ఉంటుంది. అదెవిదంగా పరిశ్రమలలో చిన్నిపాటి భద్రతా లోపాలని సరిదిద్దుకోవాడానికి అవకాశం ఉంటుందని అని తెలియజేసారు". ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన వివిద ప్రభుత్వ విభాగాల అధికారులకి మరియు అమర రాజా ఉద్యోగలందరికి రాజా హెచ్ ఎస్ సి హెడ్ డా. సురేష్ దన్యవాదాలు తెలియచేయడం జరిగింది. అనంతరం జాతీయ భద్రతా దినోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన సేఫ్టి పరికారల ఎగ్జిభిషన్ ను DCIF మరియు ప్రభుత్వ అధికారులు సందర్సించి వారి సలహాలు మరియు సూచనలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులు, శ్రీకాళహస్థి RDO శ్రీ రవి శంకర్ రెడ్డి గారు, తిరుపతి స్టేషన్ ఫైర్ ఆఫిషర్ శ్రీ కిరన్ కుమార్ రెడ్డి గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సైంటిస్ట్ శ్రీ సుదాకర్ గారు, రేణిగుంట తహషిల్దారు శంకర్ రావు గారు, అమర రాజ సీనియర్ జనరల్ మేనేజర్ నలిని కుమార్, HSE హెడ్ డా. సురేష్ కుమార్, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ హెడ్ శ్రీనివాస రావు, వైద్య అదికారి డా. చంద్ర బాబు మరియు సేఫ్టి హెడ్ సురేష్ రెడ్డి రేణిగుంట పి.హెచ్.సి డాక్టర్ డా.చంద్ర ప్రకాష్ గారు , కరకంబాడి సర్పంచ్,కార్యదర్సి మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అమర్ రాజా ఉద్యోగులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :