Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సోమవారము ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ మరియు డైటెటిక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. మరియు మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ (ఐ సి ఎం ఆర్ న్యూఢిల్లీ ) శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల , తిరుపతి. సంయుక్త ఆర్గనైజింగ్ తో జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్ పై న్యూట్రిషన్ మరియు డైట్ అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ , ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడిన ప్రిన్సిపాల్ గర్భధారణ సమయంలో గర్భిణీలు, ఆరోగ్యంపై చాలా శ్రద్ధగా ఉండాలని, అదే కొంతమంది గర్భధారణ సమయంలో మధుమేహం వ్యాధి మీద అవగాహన లేకపోవడంతో పుట్టిన బిడ్డ కూడా మధుమేహం సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నందువలన అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రసూతి వైద్యశాల నందు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం హోం సైన్స్ విభాగం నుండి అధ్యాపకులు మరియు విద్యార్థులు గర్భిణీ స్త్రీలకు వారు తీసుకుంటున్న ఎలాంటి ఆహారం అయితే అవసరమవుతుందో దానికి సంబంధించిన విషయాలను గర్భిణీ స్త్రీలకు వివరించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగినది. ప్రతి ఒక్క గర్భని స్త్రీ విటమిన్ లోపం లేకుండా బిడ్డకు జన్మనిచ్చేలా అహర్నిశలు ఇక్కడ వైద్యులు వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారా మెడికల్, మరియు ఎస్ వి.విశ్వవిద్యాలయం ఓం సైన్స్ విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ కు పౌష్టిక ఆహారాలు ఎంతో అవసరమని , గర్భధారణ సమయంలో మధుమేహం సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. తినవలసిన కూర గాయలు పండ్లు దినుసులను,విరివిగా తీసుకొని మధుమాహం వ్యాధికి గురికాకుండా తల్లి ఆరోగ్యము, బిడ్డ ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యముతో జీవించాలని ఆయన తెలిపారు. ప్రసూతి వైద్యశాల సూపెరిటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు సమావేశమైన గర్భధారణ గర్భిణీలకు ప్రసూతి వైద్యశాల నుండి కృతజ్ఞతలు తెలియపరుస్తూ. నా ఆరోగ్యం నా చేతిలో నే, అనే విధంగ గర్భధారణ సమయంలో సహజంగా గర్భిణీ స్త్రీలు, జింక్, విటమిన్ సి,ప్రోటీన్స్, మొదలగు ఆహార పదార్థాలు తీసుకోవడంలో కొంతవరకు అవగాహన లోపుతో ఉండడం వలన వారికి మధుమేహం వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి కనుక వారు మంచి ఆహార వారి ఆరోగ్యము బిడ్డ ఆరోగ్యం కాపాడుకోవలసిందిగా స్త్రీ వైద్య నిపుణులుగా వారికి ఎల్లప్పుడూ ఆరోగ్యమైన వైద్యం అందించడంలో ప్రసూతి వైద్యశాల ఎప్పుడు ముందుంటుందని సందర్భంగా ఆయన తెలిపారు. డాక్టర్ ప్రమీల విభాగాధిపతి మాట్లాడుతూ సాధారణంగా గర్భధారణ సమయంలో జింక్, విటమిన్లు మొదలగు ఆహార పదార్థాలు వాడే మెలకువలు గురించి గర్భిణీ స్త్రీలకు సహజంగా జింక్ ఎక్కడ పొందాలి, రోగనిద్దారక శక్తికి అవసరమైన ఘన విభజన, ప్రోటీన్ సంశ్లేషణ లో జింక్ పాత్ర పోషిస్తుందనిh మరియు ముందస్తు జనన ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని గర్భిణీ స్త్రీలకు రోజుకు 12 మిల్లీగ్రాములు అవసరం. పాలు పాల పదార్థాలు, జీడిపప్పు, పప్పు దినుసులు, కూరగాయలు ఆకుకూరలు మాంసము మొదలగు వాటిలో జింకు బాగా దొరుకుతుంది కాబట్టి గర్భధారణ సమయంలో మధుమేహాన్ని అరికట్టడానికి ఎంతో దోహదపడుతుందని ఆమె తెలిపారు. గర్భధారణలో మధుమేహం అనే అవగాహన వలన ఎంతో ఉపయోగకరమైన ఓకే సూత్రాలను మేము తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలను ఇక్కడికి విచ్చేసిన ఎస్ వి వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు , శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హోమ్ సైన్స్ విభాగము వారు కూలంకసంగా వివరించారు ఒక గర్భిణి గా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని , గర్భిణి స్త్రీ తెలియడం తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ , మరియు మల్టీసెప్లరీ రీసెర్చ్ యూనిట్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి, డాక్టర్.మధుసూదన్, ప్రసూతి వైద్యశాల సి ఎస్ ఆర్ ఎం ఓ డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, డాక్టర్ సునీత, డాక్టర్ స్రవంతి, ఎస్వీ విశ్వవిద్యాలయం హోమ్ సైన్స్ విభాగం నుండి ప్రొఫెసర్ కోలా మంజుల, డాక్టర్ ఝాన్సీ, ప్రసూతి ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, డాక్టర్ సునీత, డాక్టర్ స్రవంతి, డాక్టర్ ఉమాదేవి. ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ వీరకిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV