Wednesday, 28 October 2026 05:56:39 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

ఆధునిక పోటీ ప్రపంచంలో సాంకేతికతపై మహిళలు పట్టు సాధించాలి సీఐఐ సదస్సులో పలువురు వక్తల పిలుపు

Date : 19 July 2024 08:29 PM Views : 852

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచంలో మనుగడ సాధించాలంటే మహిళలకు విద్య ఎంతో ముఖ్యమని విద్య తోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే దృక్పథం ఉంటేనే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని భారత్‌ బయోటెక్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ పద్మభూషన్‌ డాక్టర్‌ సుచిత్ర ఎల్లా పిలుపునిచ్చారు. సీఐఐ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత లీడర్‌షిప్‌ క్లాన్‌కేవ్‌ ఆన్‌ పయనిరింగ్‌ ప్రొగెస్‌ అన్న అంశంపై ఒక రోజు ప్రత్యేక సదస్సును తిరుపతిలోని అమరరాజా ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సదస్సుకు అమరరాజా సంస్థల ఎండి గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, సీఐఐ చైర్మన్‌ మహాత్మాగాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మురళి, సీఐఐ సదరన్‌ రీజిన్‌ చైర్మన్‌ షిరిన్‌ సాలిస్, అరవింద్‌ ఐ ఆస్పత్రి పౌండింగ్‌ మెంబరు నట్‌చైర్, గ్రీన్‌ తత్వా అగ్రిటెక్‌ కో పౌండర్‌ రూపా మాగంటి, మున్సిపల్‌ కమిషనర్‌ ఐఏఎస్‌ అదితి సింగ్‌ పలువురు వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ నేడు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళుతున్నారని అయితే పోటీ ప్రపంచంలో సాంకేతికతను మెరుగు పర్చుకోవాల్సిన అవసరముందన్నారు. వర్కింగ్‌ నెట్‌వర్కింగ్‌ అనేది ఎంతో ముఖ్యమని అందరితో కలిసి ప్రపంచం గురించి తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో మహిళలకు సమస్యలనేవి వస్తుంటాయని వాటి నుంచి బయట పడి అన్నింటికి తట్టుకుని నిలబడి పైకిరావాలన్నారు. అందరికి కష్టపడే తత్వం ఉంటుందని దాన్ని పైకి తీసుకువచ్చి ముందుకు వెళ్లాలన్నారు. తాము ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని సమస్యలను ఓ చాలెంజిగ్‌ తీసుకుని ఈ స్థాయికి చేరుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముఖ్యంగా మనదేశంలోనే ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడే వాటికి పెటెంట్‌ ఉండేలా చూసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రైవేటు సంస్థల్లో మధ్య, సీనియర్‌ స్థాయిలో మహిళలు సంఖ్య ఎంతో తక్కువగా ఉందని దీన్ని పెంచుకుని మహిళలకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆలోచన ఉంటే ముందుకు రాలేరని భారతదేశంలో ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముందుకు నడిచి ప్రయత్నించి కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అలాగే పలువురు వక్తలు మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. సీఐఐ చైర్‌ విమన్‌ డాక్టర్‌ రమాదేవి, వైస్‌చైర్మన్‌ చాందిని చందనా పలు అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి పలువురు అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :