Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం,భక్తుల కోర్కెలు తీర్చే కల్పవళ్ళి బోయకొండ గంగమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఇటు ఆంద్రప్రదేశ్ అటు కర్ణాటక,తమిళనాడు లనుండి భక్తులు అధికంగా వచ్చారు,భక్తులు ఉదయం నుండి క్యూలైన్లలో అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు.ప్రధాన అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పరిశీలించారు.చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. అనంతరం ఉచిత ప్రసాదాల వద్ద తోపులాటలు లేకుండా అందరూ క్యూలైన్లో వెళ్ళి ప్రసాదాలు తీసుకొనే విధముగా సిబ్బందిని ఆదేశించారు.ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద 500,1000 రూపాయలు టికెట్లు రాకపోవడంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు.గంటల తరబడి నిలబడ్డారు.అంతే కాకుండా అమ్మవారి పవిత్ర తీర్థం ఇచ్చు ప్రదేశంలో కూడా కంప్యూటర్లు పనిచేయక పోవడంతో చాలామంది భక్తులు అసహనానికి గురైనారు.భక్తుల కు త్రాగునీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మవారి బలిపీఠము వద్ద జంతుబలులను,అక్కడ గల సౌకర్యాలను,అలాగే తలల వేలం పాటవద్ద గల భక్తులతో చర్చించి,వేలం పాట సవ్యంగా జరుగుతున్నదా లేదా అనేవిషయాలపై,సిబ్బంది భక్తులతో మాట్లాడుతున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు,కళ్యాణ కట్ట వద్ద భక్తులకు తలనీలాలు సమర్పించే భక్తులు టికెట్టు ద్వారానే తలనీలాలు సమర్పించాలనీ,ఎవరికీ అధనంగా పైకము చెల్లించవద్దని భక్తులకు తెలియజేశారు,కళ్యాణ కట్ట లో ఎవరైనాసిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కార్యాలయం దృష్టికి వస్తే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కళ్యాణ కట్ట సిబ్బందిని హెచ్చరించడం జరిగింది,అంతే కాకుండా అనునిత్యం సమాచార కేంద్రం నుండి ఆలయ ప్రాంగణం లో జేబుదొంగలున్నారని,తమ విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని భక్తులకు హెచ్చరికలు చేశారు,ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా,ఎవరైనా పిల్లలు తప్పిపోయినా పరిపాలనా కార్యాలయం ఎదురుగా గల సమాచార కేంద్రం లో సంప్రదించాలని సూచించడం జరిగింది.దేవస్థానం పరిసరాలలో ఇద్దరు పిల్లలు తప్పిపోవడంతో దేవస్థానం సమాచార విభాగం ద్యారా తెలియజేసి, వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగినది.దేవస్థానం నందు వాహనాలు పార్కింగ్ స్థలం నిండిపోయినా, వాహనాలు పైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పుంగనూరు రూలర్ సిఐ సాయి ప్రసాద్, చౌడేపల్లి ఎస్సై చిన్నరెడ్డెప్ప, తమ సిబ్బంది చే ట్రాఫిక్ నియంత్రణ చేశారు.కొండ దిగువ భాగాన వాహనాలు నిలుపుదల కు సరైన పార్కింగ్ స్థలం లేక పోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ముందు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పుట్ బోర్టు ను పూర్తిగా వ్యాపారస్థులు ఆక్రమించడంతో వాహనాలు నడిరోడ్డు పైన నిలుపడంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు.షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏదైనా ప్రమాదం సంభవిస్తే అప్పుడు మేల్కంటారా అని భక్తులు వాపోతున్నారు. ఈ పుట్ బోర్టు ఆక్రమణ పై వివిధ పత్రికలలో గతంలో ఎన్నో వార్తాకథనాలు వచ్చిననూ దేవాదాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.ఇకనైనా సంబందిత అధికారులు చొరవ చూపితే దేవస్థానం పైన సదభిప్రాయం ఉంటుందని భక్తులు వారి అభిప్రాయాలు తెలిపారు.
Admin
Famous TV