Friday, 31 July 2026 01:40:09 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

104 వ ఏ. ఐ.టి. యు. సి. వ్యవస్థాపక దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించిన ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్

Date : 31 October 2023 06:56 PM Views : 624

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏ.పీ.మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ మరియు ఏ.పి.మెడికల్ కాంట్రాక్టు వర్కెర్స్ యూనియన్ తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల బ్రాంచీలు జెండా ఆవిష్కరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర జి.రవి ప్రభు , శ్రీవెంకటేశ్వరవైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్. పి.ఏ.చంద్రశేఖరన్, ఈ సందర్భంగా డాక్టర్ రవి ప్రభు మాట్లాడుతూ యూనియన్ 104 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ యూనియన్ లోని సభ్యులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పర్ష్కరించుకోవలని ఉద్యోగుల సమస్యలు ఏదైనా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేశారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులు సమైక్యంగా ఉండాలని , అందరూ కలిసి కళాశాల అబివృద్దికి తోడ్పడాలని, హక్కులతో పాటు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలని , ఉద్యోగుల సమస్యలు ఏదైనా పరిష్కరము చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలియచేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ అడ్మిన్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్య కళాశాలలో పనిచేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల మేరకే పని చేస్తాం కాబట్టి అందరం కలిసికట్టు గా సమస్తను అభివృద్ధి పరచవచ్చని, మెరుగైన వైద్య విద్యను, పేద రోగులకు మెరుగైన వైద్యం అందించే దానికి తోడ్పాటు అందించినట్లయితే , ఎస్వీ వైద్య కళాశాలను దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టవచ్చును అని ఈ సందర్భంగా తెలిపారు. ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావలసిన జి పి ఎఫ్, ఏ పి జి ల్ ఐ లోన్స్, సరెండర్ లీవ్ జీతం, డి. ఏ. బకాయిలు, పిఆర్ సి బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈరోజు వరకు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఔట్సోర్సింగ్ లో పనిచేయు ఉద్యోగులను వెయిటేజ్ ఇచ్చి కాంట్రాక్టు విధానం లోకి మార్చాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని ,ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -1, ల్యాబ్ సూపర్వైజర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ -1, ఫార్మసీ సూపర్వైజర్ అదనపు పోస్టులను మంజూరు చేయాలని, ఫార్మసీ విభాగంలో పని చేయు ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ స్టాఫ్ ఇన్ సెంటివ్ చెల్లించాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సానిటేషన్ వర్కర్లకు 549 జీవో ప్రకారం వేతనం 16,000 చెల్లించాలని, బెడ్ల సంఖ్య ఆధారంగా వర్కర్ల సంఖ్య పెంచాలని పని భారం తగ్గించాలని. కాంట్రాక్టు మేనేజ్మెంట్ వేధింపులు మానుకోవాలని కొంతమందికి మాత్రమే జీతాలు చెల్లించి మిగిలిన వారికి జీతాలు నిలిపివేయడం శోచనీయమని వెంటనే వారికి జీతాలు వేయాలని,పిఎఫ్ ఈఎస్ఐ నిబంధనల ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డు లకి కూడా కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవో తిరుపతి నగర్ అధ్యక్షులు సిరిమవిల్ల సురేష్ బాబు మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యల పట్ల ఏఐటియుసి అలుపెరగని పోరాటం చేస్తా ఉందని, ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకుని వస్తే మీరు చేసే న్యాయమైన కోరికల పరిష్కారానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. కళాశాల అధ్యక్షులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ గారు ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందిస్తున్నారని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి బ్రాంచ్ కార్యదర్శి కే ప్రభాకర్, ఎస్వీఎంసీ అధ్యక్షులు వీర కిరణ్ , కార్యదర్శి కే. సి సుబ్రహ్మణ్యం, ఏఐటీయూ సి నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జిల్లా కార్యదర్శి మహేంద్ర,సునీల్, పురుషోత్తం నాయకులు సురేంద్ర, లోకేష్, మురళి, రాజ్యలక్ష్మి, ఆస్థాన బేగం, సుజాత, భక్తవత్సలం, గిరి కుమార్, విజయ్ కుమార్, సురేష్, భువనేశ్వరి, కిరణ్ కుమార్, వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: