Thursday, 30 July 2026 04:46:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్ పరిశ్రమ వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం జగన్మోహనరెడ్డి

ఫలించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి

Date : 22 June 2023 05:24 PM Views : 748

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ప్లాంట్ ఏర్పాటుకు పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో వరుస సంప్రదింపుల ఫలితం నేడు శంకుస్థాపన. గ్లోబల్ సమ్మిట్ లోని ఒప్పందాల్లో రూ.1,425 కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయి.తిరుపతి పార్లమెంట్ పరిధి సర్వేపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ పార్కులో రూ.610 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌ లక్ష్యంగా "క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌" నిర్మించ తలపెట్టిన బయో ఇథనాల్‌ తయారీ ప్లాంటు నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈ బయో ఇథనాల్ ప్లాంట్ వలన పరిసర ప్రాంతాల లోని రెండు జిల్లాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి అన్నారు. ముఖ్యంగా విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్‌ తయారీ చేస్తారని ఆయన అన్నారు.

వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారీ బై ప్రొడక్ట్‌గా డ్రైడ్‌ డిస్టిలరీస్‌ గ్రెయిన్స్‌ తయారీ చేస్తారని ఆయన అన్నారు. ఈ ప్లాంట్ త్వరితగతిన పూర్తయి రైతులకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. నెల్లూరు జిల్లాలోనే రూ. 315 కోట్లతో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో ఈ ప్లాంట్ నెలకొల్పానున్నారు. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలియజేసారు. అలాగే రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారని ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలియజేసారు. "క్రిబ్ కో" స్థాపనకు అనుమతులు పొందేందుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి భగవంత్ ఖుభా మరియు సహచర ఎంపిలకు, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ధన్యవాదములు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: