Famous TV - ఆంధ్రప్రదేశ్ / పల్నాడు ( నరసరావుపేట ) : వ్యవసాయ రంగం వర్తమానం- భవిష్యత్తు పై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియంలో అఖిలపక్షాల భేటీ జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం నిలవాలి రైతు గెలవాలి అనే నినాదంతో వ్యవసాయ రంగం వర్తమానం- భవిష్యత్తు పై మంగళవారం నాడు అఖిలపక్షాలతో కలిసి రైతు సంఘ నాయకులు,భారత కమ్యూనిస్టు పార్టీ నరసరావుపేట ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో చర్చ గోస్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ......జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ అవస్థ పడుతున్నాయని ఇన్పుట్ సబ్సిడీలను ఎత్తి వేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని డా౹౹చదలవాడ విమర్శించారు.జగన్మోహన్ రెడ్డిది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వ్యాపారులతో కుమ్మక్కై సబ్సిడీలను ఎత్తి వేసి విత్తనాలు,ఎరువులు ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా దళారీ వ్యవస్థతో చేతులు కలిపి రైతుల పండించిన పంటలకు కనీసం మద్దతు ధర లేకుండా రైతుల నోర్లు కొడుతున్నారని ఆరోపించారు.ఈ క్రాప్ నమోదు చేయకుండా అకాల వర్షంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందకుండా రైతు ఆత్మహత్యలను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సాగర్ కుడి కాలువ 126 కిలోమీటర్లు మేర పూడిక ఏర్పడి కలవర్టులు కొట్టుకుపోయాయని,కాలువలో చెట్లు పెరిగి రైతులకు కాలువ నీళ్లు అందడం లేదని ఈ విషయం పై ఇరిగేషన్ అధికారులు,ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సీఎం జగన్ రెడ్డికి చలనం లేదని ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్లు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు,రైతు నాయకులు పాల్గొన్నారు.
Admin
Famous TV