Wednesday, 29 July 2026 08:30:47 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పల్లం విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు...

Date : 01 July 2024 06:29 PM Views : 841

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల "పల్లం" పాఠశాలకు వివిధ మారుమూల గ్రామాలనుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సును మంజూరు చేయించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి ఆనంద్ గారు తెలియజేశారు. పల్లం పాఠశాలకు దాదాపు 40 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు, ఇందులో 32 గ్రామాలనుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం పూర్తిగా లేకపోవడం వలన విద్యార్థులు ఆటోలపై ఆధారపడి ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆడపిల్లలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు , అందువలన తల్లిదండ్రులు పాఠశాలకు పంపలేకపోతున్నారు, రవాణా సౌకర్యం పూర్తిగా లేనందువలన ప్రతిరోజు వందమందికి పైగా విద్యార్థులు హాజరు కావడం లేదు, ఆటోలలో రావాలంటే ప్రతిరోజూ 50 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది, తల్లిదండ్రులు ప్రతిరోజు 50 రూపాయలు ఆటోలకు ఇవ్వడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం వలన విద్యార్థులు రోజూ పాఠశాలకు రాలేకపోతున్నారు . రవాణా సౌకర్యం లేనందున కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాకుండా(Dropout) నిలిచిపోతున్నారు మరియు మరికొందరు విద్యార్థులు సంవత్సరం పూర్తిగా పాఠశాలకు రావడం లేదు. ఈ పరిస్థితిని గమనించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ T. ఆనంద్ గారు తిరుపతి జిల్లా DTPO (District Transportation public officer) శ్రీ చంగల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా , శ్రీ చంగల్ రెడ్డి గారు వెంటనే స్పందించి విద్యార్థుల సౌకర్యార్థమై వెంటనే బస్సును మంజూరు చేయవలసిందిగా వెంకటగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రామకృష్ణ గారికి ఆదేశించడమయినది, వెంకటగిరి డిపో మేనేజర్ శ్రీ రామకృష్ణ గారు మరియు అసిస్టెంట్ మేనేజర్ శ్రీ శివాజీ గారు రూట్ ను పరిశీలించి విద్యార్థుల సౌకర్యార్థం బస్సును ఏర్పాటు చేశారు. జిల్లాలో బస్సుల కొరత ఉన్నప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థమై వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడంలో డిటిపిఓ గారు చొరవ తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ టి. ఆనంద్ గారు తెలియజేశారు, అడిగిన వెంటనే విద్యార్థులు సౌకర్యార్థమై బస్సును ఏర్పాటు చేసినందుకు తిరుపతి జిల్లా డిటిపిఓ గారు అయినటువంటి చెంగల్ రెడ్డి గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టీ. ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియజేశారు, ఇంతకాలం విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి చాలా ఆవస్థలు పడ్డామని, ఇకనుంచి విద్యార్థులు అందరినీ పాఠశాలకు పంపించడానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని తల్లిదండ్రులు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు, బస్సును ఏర్పాటు చేయించినందుకు తల్లిదండ్రులు మరియు గ్రామస్తులందరూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ కమిటీ చైర్మన్ శ్రీ చంద్రశేఖర్ నాయుడు గారు పాఠశాల ఉపాధ్యాయులు కె.వి బాబు, రెడ్డప్ప, వెంకటరామయ్య, రామసుబ్బమ్మ, పుష్పవాణి, వాణి, సురేష్ ,సోమశేఖర్ రాజు, శ్రీరాములు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :