Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మండల అభివృద్ధి కార్యాలయం నందు తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి సోమవారం ఉదయం పలు కార్యాలయాలు సందర్శించి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆరా తీశారు.రెవెన్యూ,మండలం పరిషత్ అభివృద్ధి,ఉపాధి హామీ పథకం, గృహనిర్మాణం, వసతి సంబంధిత అధికారులతో సమీక్ష నిరవహించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రమేష్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,బోయకొండ సుబ్బు,గిరి రాజు,ఆవుల పవన్ మండల నాయకులు పాల్గొన్నారు.
Admin
Famous TV