Saturday, 12 September 2026 01:28:38 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు

Date : 27 August 2026 09:13 AM Views : 71

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఆగస్టు 27 ఫేమస్ టీవి న్యూస్ : చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామపంచాయతీ పరిధిలోని అగస్తిగానిపల్లి మజారా గ్రామంలో సంతకాలు లేని పత్రం ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారంటూ ఆరోపణలు వెలువడ్డాయి. సంబంధిత భూమి విషయంలో భారీగా చేతులు మారినట్లు గ్రామస్తులు ఆరోపిస్తుండగా,ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు.గ్రామస్తుల వివరాల ప్రకారం అగస్తిగానిపల్లి మజారా పరిధిలోని సర్వే నంబర్ 53/1లో 1.07 సెంట్ల భూమి ఉందని,ఆ భూమిని స్థానికులు కాటమరాయుడు మాన్యం భూమిగా పేర్కొంటున్నారు.అయితే ఈ భూమికి సంబంధించిన హక్కుల విషయంలో వివాదం నెలకొంది.నకిలీ వీలునామాతో పాసుపుస్తకం చేశారా? 31-08-2000 తేదీతో రూ.100 నాన్‌ జుడీషియల్ స్టాంప్ పేపర్ నంబర్ 249846,స్టాంప్ వెండర్ నంబర్ 6446/31.08.2000, స్టాంపును గంగప్ప కుమారుడు యర్రప్ప పేరున కొనుగోలు చేశారు.ఎల్ నెంబర్ 10-08-004/2010 స్టాంప్ వెండర్ రవీంద్ర పేరుతో ఉన్న పత్రాన్ని ఆధారంగా చేసుకున్నట్లు సమాచారం.ఆ పత్రంలో రాసిచ్చిన వ్యక్తిగా చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామపంచాయతీ అగస్తిగానిపల్లికి చెందిన కొంపల్లి మునెప్ప కుమారుడు చెంగప్ప పేరు,రాసుకున్న వ్యక్తిగా కొంపల్లి యర్రప్ప కుమారుడు,అప్పటికి 16 సంవత్సరాల మైనర్‌గా పేర్కొన్న జయశంకర్ పేరు ఉన్నట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు.అయితే ఈ పత్రంపై రాసిచ్చిన వారి సంతకాలు ఎక్కడ ఉన్నాయన్నది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మారింది. సంతకాలు లేని లేదా అనుమానాస్పద పత్రాన్ని ఆధారంగా చేసుకుని రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.2020లో పట్టాదారు పాసుపుస్తకం సదరు పత్రాన్ని అధికారుల ముందు సమర్పించి,29-04-2020న ఖాతా నంబర్ 1146గా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయించుకున్నట్లు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? పత్రం అసలైనదేనా? దాని చట్టబద్ధతను అధికారులు పరిశీలించారా? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉందని వారు కోరుతున్నారు.అంతేకాకుండా,మైనర్ పేరుతో భూమిని రాసిచ్చినట్లు పేర్కొంటున్న నేపథ్యంలో,అప్పటి న్యాయపరమైన పరిస్థితులు, పత్రం నమోదు విధానం, సంబంధిత రెవెన్యూ రికార్డులు తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఈ వ్యవహారంపై సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ చౌడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.భూమికి సంబంధించిన అసలు పత్రాలు, వీలునామా చట్టబద్ధత, సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు,పట్టాదారు పాసుపుస్తకం జారీ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.అయితే,ఈ ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ అధికారులు అధికారికంగా ఏమి చెబుతారన్నది తెలియాల్సి ఉంది.విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: