Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శనివారము రుయా ఆసుపత్రి , ఎస్ వి వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆదేశాల మేరకు వైద్య విద్యార్థులకు నర్సింగు మరియు పారామెడికల్ విద్యార్థుల ద్వారా ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం , ప్రజలకు అర్థమయ్యేలా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగినది . విభాగాధిపతి డాక్టర్ రాధాకృష్ణరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జాహ్నవి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు, యుక్త వయసు వారు , మరియు వ్యాపారస్తులు మానసిక కుంగుబాటుకు ఎక్కువగా గురి అవుతున్నారు, వారు ఇలాంటి కుంగుబాటు సమయంలో ఆత్మహత్యకు లోన్ అవుతూ వారి యొక్క ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతున్నది . వారు గాని మానసిక వైద్య నిపుణులు గాని, మానసిక కౌన్సిలర్లు గాని , సంప్రదించినట్లయితే , ప్రత్యేకమైన చికిత్స కౌన్సిలింగ్ తీసుకొని ఆత్మహత్యలు అనే ఆలోచన నుండి బయటపడి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ యొక్క మానసిక వైద్య విభాగం ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ర్యాలీ వల్ల ప్రజలకు రోగులకు మానసిక కుంగుబాటు నుండి బయటపడడానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతైనా అవసరమని తెలిపారు. ఆత్మహత్యలు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కావలసిన కౌన్సిలింగ్ ను రుయా ఆసుపత్రి మానసిక విభాగము నందు ఎల్లవేళలా మానసిక వైద్యులు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి బాగా జీవించాలని , ఆరోగ్యంగా ఉండాలని ఈ అవగాహన కార్యక్రమంలో నినాదాలు ద్వారా ప్రజలకు సందేశము అందించడం జరిగినది. డాక్టర్ భారతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఒక కోటి 1.64 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని , ఘనంగా ఈ సంఖ్య పెరగడం చాలా ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. అందుకు ఉమ్మడి కుటుంబమే ఆనందంగా జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ రోజుల్లో పెద్దలు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా జీవించేవారు, అని ఇప్పుడు ఇండిజువల్ ఫ్యామిలీ , అని ఎవరికి వారు జీవించడం వల్ల మానసిక ఒత్తిడిని జయించలేకపోతున్నారు, అందులోంచి కలిగే పరిణామమే ఆత్మహత్యలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబం గా ఉండడం ఎంతో మేలని అన్నారు. మానసిక వైద్య నిపుణులతో మాట్లాడదాం జీవితాల్ని కాపాడుకుందాం , వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు నినాదాలతో, ప్రజలకు అవగాహన కలిగే ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూజీ,పిజి వైద్య విద్యార్థులు, మరియు నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది, డి అడిక్షన్ సెంటర్ మానసిక వైద్య కౌన్సిలర్లు ముకుంద నాయుడు, మురళి, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీరికిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV