Sunday, 19 April 2026 05:42:16 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ

Date : 09 June 2023 05:43 PM Views : 764

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరకంబాడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద మరియు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం గారి విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి. శేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని "కీ" టీవీ డైరెక్టర్ శ్రీ పరమశివన్ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని తిరుపతి విద్యాశాఖ అధికారి డాక్టర్ వి శేఖర్ గారు., స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కాణిపాకం ఈవో మరియు డిప్యూటీ కలెక్టర్ అయిన శ్రీ వెంకటేష్ గారు ఆవిష్కరించారు.

పాఠశాలలో యోగ మరియు మెడిటేషన్ హాలుకు విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీ కంచి రఘురాం గారు భూమి పూజ చేసారు. తిరుపతి విద్యాశాఖ అధికారి శ్రీ డాక్టర్ వి శేఖర్ గారు ప్రసంగిస్తూ పాఠశాల స్థాయిలో ఇలాంటి గొప్ప వారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించడం వలన వారు సమాజానికి చేసినటువంటి సేవను గురించి విద్యార్థులకు తెలియ చెప్పవచ్చునని తెలియజేశారు.. కాణిపాకం ఈవో గారు ప్రసంగిస్తూ ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో సేవాస్ఫూర్తిని పెంపొందించవచ్చని గొప్ప గొప్ప సైంటిస్టులుగాను, మానవతావాదులుగాను తయారు చేయవచ్చునని తెలియజేశారు... పరమశివం గారి ప్రసంగిస్తూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అంబేద్కర్ జీవితం ప్రతి వ్యక్తికి ఆదర్శప్రాయమని కొనియాడారు.. కంచి రఘురాం గారు ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి మానసికంగా ఎదగాలని మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలని తెలియజేశారు

రాబోయే రెండు నెలల్లో ధ్యాన మందిరాన్ని పాఠశాలలు ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ధ్యానవంతులుగా అయ్యేటట్టు డ్యానామందిరాన్ని నిర్మిస్తామని తెలియజేశారు ..రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ నారాయణ స్వామి గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు దేశ నాయకులు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలని అబ్దుల్ కలాం అంబేద్కర్ మరియు వివేకానందుల జీవిత చరిత్రను తెలియజేయాలి అని తెలియజేశారు.. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శ్రీ ఆనంద్ గారు ఈ విగ్రహాలను పాఠశాలలు ఏర్పాటు చేసినందుకు సహకరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి జీవిత చరిత్ర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.. పాఠశాలలో కాణిపాకం EO గారి చేతుల మీదుగా ప్రగతి ఆర్గనైజేషన్ వారి సమక్షంలో బాల్యవివాహాల రద్దు సంబంధించినటువంటి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో తిరుపతి "సేవ్" నర్సింగ్ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ ప్రవీణ్ గారు ప్రగతి ఆర్గనైజేషన్ శ్రీ రమణ గారు, టిటిడి ఈఈ మనోహరం గారు, పంచాయతీరాజ్ AO కోమలేశ్వరి గారు , వే ఫౌండేషన్ అధ్యకులు డా. అంకయ్యగారు,హ్యూమన్ రైట్స్ ఇంచార్జి డా. కె. సి. కుసుమ కుమారి... కలాం ట్రస్ట్ అధ్యక్షులు భాష గారు... యువతేజం ట్రస్ట్ అధ్యక్షులు కరీముల్లా గారు... నిర్మల గారు రామరాజు గారు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :