Famous TV - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసుల, క్రీడల మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ నెహ్రూ కేంద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా వారి సహకారంతో శ్రీకాళహస్తి బ్లాక్ కి సంబంధించి ఏర్పేడులో యువ నేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరీ మట్టి మేరీ దేశ్ కలశయాత్ర ఏర్పేడు సర్కిల్ నుంచి హైస్కూల్ వరకు డప్పు వాయిద్యాలతో, పిల్లల కోలాటాలతో కోలాహలంగా ర్యాలీ జరిగిందని అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు. నెహ్రూ యువకెంద్రం అకౌంట్ ఆఫీసర్ బాబి రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మొదటగా వందేమాతరంతో గీతంతో ప్రారంభించి, కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపి, తదుపరి పంచప్రాణ ప్రతిజ్ఞను ప్రజలతో చేయించారు. తదుపరి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి నెహ్రూ యువ కేంద్రం స్టేట్ డైరెక్టర్ శ్రీమతి విజయ రావు గారు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు నూతనంగా నిర్మించబడిన పార్లమెంట్ ఆవరణలో అమరవీరుల చిహ్నాలుగా ఉద్యానవనాన్ని ఏర్పాటులో భాగంగా దేశం నలుమూలల నుంచి మట్టిని సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి తరపున మట్టిని కలశంలో సేకరించి ఢిల్లీకి పంపుతామని తెలిపారు. దేశ నలుమూలల నుంచి సుమారు 75 వేల మంది యువతతో ప్రధాని గారి అధ్యక్షతన ఈ నెల 30, 31 తేదీలలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హనుమంత్ నాయక్, యువనేస్తం చారిటబుల్ అధ్యక్షులు వినోద్, కోశాధికారి మునెమ్మ, ప్రగతి కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఏర్పేడు మరియు శ్రీకాళహస్తి మండల కోఆర్డినేటర్లు అరుణ మరియు నాగమణి, వాలంటీర్లు వెంకటేష్, మధు, అంకయ్య, ముత్యాలమ్మ, లక్ష్మి, హేమ, స్రవంతి, స్వాతి, మారయ్య, గోపాల్, శైలజ మరియు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పాల్గొన్నారు.
Admin
Famous TV