Tuesday, 27 October 2026 04:17:48 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

ముంచుకొస్తున్న మరో తుపాన్..

Date : 10 December 2023 06:52 PM Views : 789

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. ఈ నెల 16న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 18న అల్పపీడనంగా మారనుంది. అల్పపీడనం భారీ తుపాన్‌గా మారి శ్రీలంక, తమిళనాడుతో పాటు ఏపీ వైపు కూడా పయనించే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావంతో ఏపీలో ఈ నెల 21 నుంచి 27 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే మిగ్‌జాం తుపాన్‌తో అతలాకుతలమైన ఏపీకి.. మరో తుఫాన్‌ ముపు పొంచి ఉండటంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మిగ్‌జాం మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాన్‌ ఎఫెక్ట్‌ అనే వార్త రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలో చేతికొచ్చిన పంట నీటమునిగి రైతులు తీవ్లరంగా నష్ట పోయారు. ఇప్పుడు మరో తుపాన్ ముంచుకొస్తుందనే వార్త అన్నదాతలను భయాందోళనకు గురిచేస్తుంది. ఏపీకి మరో తుపాన్ ముపు పొంచివుండటంతో అటు అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం చర్యలు చేపట్టింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :