Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి సెప్టెంబర్ 24 ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం కాటిపేరి గ్రామ రెవెన్యూ పరిధిలోని అగస్తిగానిపల్లి మజరా సర్వే నంబర్ 53/1లో ఉన్న 1.07 సెంట్ల అసైన్మెంట్ భూమి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామీణ ఆగ్రో రీ కన్‌స్ట్రక్షన్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షులు ఉత్తరాది హరిప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఉత్తరాది హరిప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏయం నంబర్ 1102/4/1390కు సంబంధించిన భూమిని కె.యర్రప్ప తండ్రి గంగప్ప పేరుతో అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నంబర్ 6446, తేదీ 31-08-2000 ద్వారా పొందినట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిపారు.సదరు పత్రాన్ని జయశంకర్ రాసినట్లు, అయితే అందులో రాసి ఇచ్చిన వారి సంతకాలు లేవని ఆయన ఆరోపించారు.అలాగే యర్రప్పకు సంబంధించిన కుటుంబ ధ్రువీకరణ పత్రం కూడా జత చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పత్రంలో కే.నరసింహారెడ్డి,వై.గోవిందరెడ్డి సాక్షులుగా ఉన్నారని తెలిపారు.అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా ఖాతా నంబర్ 1146 ఏర్పాటు చేయడంపై గతంలోనే అనుమానాలు వ్యక్తమైనట్లు హరిప్రసాద్ పేర్కొన్నారు.ఈ అంశంపై పత్రికల్లో వార్తలు ప్రచురితమైన అనంతరం పుంగనూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ చరవాణి ద్వారా సంబంధిత పత్రికా విలేకరికి ఫోన్లు చేసినట్లు కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అసైన్మెంట్ భూముల బదలాయింపుపై చట్టపరమైన నిబంధనలను పరిశీలించి,సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని హరిప్రసాద్ అధికారులను కోరారు.ఈ విషయంపై 2026 ఆగస్టు 24న చౌడేపల్లి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ,సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా నెలరోజుల పాటు ఫిర్యాదును పెండింగ్‌లో ఉంచారని ఆయన ఆరోపించారు.అలాగే,అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి దేవేంద్రకుమార్ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించడంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.తాను 2023లో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత ఆధారాలను సేకరించిన అనంతరమే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు హరిప్రసాద్ తెలిపారు.ఫిర్యాదుదారు పేర్కొన్న ప్రకారం,సంతకాలు లేని పత్రం విషయంలో సంతకాలు ఉన్న డాక్యుమెంట్ ఉందని నివేదిక సమర్పించారనే ఆరోపణలపై కూడా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.అధికారులు రికార్డులు,పత్రాల అసలు ప్రతులు,ఖాతా మార్పిడి ప్రక్రియ,సంబంధిత రెవెన్యూ ఫైళ్లను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు చౌడేపల్లి తహసీల్దార్,మదనపల్లి సబ్ కలెక్టర్,అన్నమయ్య జిల్లా కలెక్టర్,మంగళగిరిలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు ఫిర్యాదు ప్రతులను పంపినట్లు ఉత్తరాది హరిప్రసాద్ తెలిపారు.
Admin
Famous TV