Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎస్ వి వైద్య కళాశాల మైక్రో బయాలజీ విభాగమునకు హెచ్.ఐ.వి టెస్టింగ్ లేబరేటరీ కి నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లేబరేటరీస్, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సేవలను గుర్తించి ఈ సర్టిఫికెట్ అందజేయడం జరిగినది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సర్టిఫికెట్ లభించడం మొట్టమొదటిసారిగా ఎస్ వి వైద్య కళాశాలకు లభించడం చాలా గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఎ చంద్రశేఖరన్, మైక్రో బయాలజీ విభాగమునకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్ జి ఎన్ రవి ప్రకాష్ మాట్లాడుతూ ఎన్ ఎ బి ఎల్ అక్రిడేషన్ మైక్రో బయాలజీ విభాగమునకు రావడం చాలా సంతోషదాయకమని అందులోనూ హెచ్ఐవి విభాగం నందు పనిచేస్తున్న సిబ్బంది ఎంతో కాలంగా ఎనలేని కృషి చేసి ఈ విభాగమునకు ప్రసిద్ధిగాంచిన ఎన్. ఎ.బి.ఎల్ అక్రిడేషన్ తీసుకురావడం వారి కృషికి, వారి పని పట్ల వారికి ఉన్న నిబంధత తెలియజేస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ లేబరేటరీ నందు హెచ్ ఐ వి వ్యాధి సంబంధించిన టెస్ట్లు చేయడంలో నైపుణ్యతను కనపరిచిన టెక్నికల్ ఆఫీసర్స్, లాబరేటరీ టెక్నీషియన్స్ , హెచ్ఐవి కౌన్సిలర్స్ , ఎనలేని నైపుణ్యతను కనపరిచినందుకు గుర్తింపు రావడం జరిగినది. ఈ విభాగము నందు హెచ్ఐవి కౌన్సిలింగ్, హెచ్ఐవి రాపిడ్ టెస్టు, సిడి ఫోర్ టెస్ట్, మరియు హెచ్ఐవి వైరల్ లోడ్ పరీక్షలు ఉచితంగా చేయబడునని ఈ సందర్భంగా విభాగాధిపతి తెలియపరిచారు. వీరు ఐ.ఎస్.ఓ 15189: 2012, అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వారి ప్రమాణాలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించబడునని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి అదనపు జిల్లా వైద్యాధికారి మరియు జిల్లా ఎయిడ్స్, లెప్రసీ మరియు టిబి అధికారి డాక్టర్ అరుణ సులోచన దేవి, ఎయిడ్స్ విభాగ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ఎస్ మూర్తి, మైక్రో బయాలజీ ప్రొఫెసర్, హెచ్ఐవి ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ జి రాజ్యలక్ష్మి , క్వాలిటీ మేనేజర్ డాక్టర్ ఎన్ శ్రీ వాణి, ఏ ఆర్ టి విభాగ వైద్యాధికారి డాక్టర్ ఆనందరావు, టెక్నికల్ ఆఫీసర్స్ జి అర్చన, పి. బాలాజీ రావు , ఐ సి టి సి కౌన్సిలర్ అప్పలరాజు , తేజోరాని, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ రామసుబ్బారెడ్డి, సి డి4 టెక్నీషియన్స్ భారతి, ఏంజెల్, హెచ్ఐవి వి ఎల్ ఎల్, టెక్నీషియన్ హర్షత్ వర్మ, ఎస్ ఆర్ ఎల్ టెక్నీషియన్ స్వప్న, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర్ కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV