Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతిని పురస్కరించుకొని సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాల వేసిన బ్రహ్మాండచారి అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు మహిళా అభివృద్ధి కోసం మరియు తెలుగు భాష అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప కవి అని ఆ రోజుల్లోనే బాల్య వివాహాల నిర్మూలనకు వితంతు వివాహాలను ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని శ్రీవిద్యను ప్రోత్సహించాడని నువ్వు చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని చెప్పిన గొప్ప మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని బ్రహ్మానందచారన్నారు తనం తాను దిద్దుకునే వాడు మనిషి సమాజాన్ని తీర్చిదిద్దే వాడు మహానుభావుడని కందుకూరి వీరేశలింగం పంతులు సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తిని బ్రహ్మానంద చారి కొనియాడారు ఈ కార్యక్రమంలో మూడో సంఘం నాయకులు కేఈ వెంకటసుబ్బయ్య గౌడు సుధాకర్ గౌడ్ భాస్కర్ జావిద్ మొదలగు వారు పాల్గొన్నారు
Admin
Famous TV