Famous TV - ఆంధ్రప్రదేశ్ / : అమరావతి: ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పోరేషన్‌లు, ఇతర ప్రభుత్వ సంస్ధలలో అయిదు రోజులు పనిదినాలను మరో ఏడాది పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్జప్తి మేరకు నిర్ణయం అంటూ వెల్లడించింది. ఈ మేరకు జీఏడీ సర్వీసెస్ సెక్రటరీకి సీఎం సెక్రటరీ కె ధనుంజయ రెడ్డి లేఖ పంపారు. వారానికి అయిదు రోజులుపాటు శని, ఆదివారాలు మినహయించి ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.30 వరకు పనివేళలుగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఈనెల 27 నుండి అమలులోకి వస్తుందని వెల్లడించారు.
Admin
Famous TV