Thursday, 30 July 2026 04:39:23 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా డా వై ఎస్ ఆర్ రైతు దినోత్సవం

జిల్లాలో 2193 మంది రైతులకు డా వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా లబ్ది

Date : 09 July 2023 09:38 AM Views : 489

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రూ.105.91 లక్షలతో నియోజక వర్గ స్థాయి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి.. శాసన సభ్యులు సత్యవేడు, జూలై 08: దివంగత ఆనాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే ఉచిత విద్యుత్ అమలు తో పాటు అనేక కార్యక్రమాలతో రైతులకు , పేదలకు అండగా నిలిచారని ఆ మహనీయుడు చేసిన కార్యక్రమాలు ఎన్నో వున్నాయని ఆయన జన్మదినం సందర్భంగా మనం ఆయన్ను గుర్తు చేసు కోవాల్సిన అవసరం వుందని సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం అన్నారు. వ్యవసాయం ఒక పండుగ అని తెలియజేసిన గొప్ప వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా తిరుపతి జిల్లాలో 2193 మంది రైతులకు వరుసగా నాల్గవ ఏడాది డా వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా రూ. 70.82 లక్షలు పంటనష్ట పరిహారం అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో భాగంగా ఖరీఫ్ 2022 లో పంట నష్టపోయిన రైతులకు వై.యస్.ఆర్ ఉచిత పంటల భీమా పథకం ద్వారా భీమా మొత్తం లబ్ధి ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేసే కార్యక్రమంలో భాగంగా వీక్షించే విధంగా ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా స్థాయి రైతు దినోత్సవం కార్యక్రమం సత్యవేడు నియోజవర్గo , సత్యవేడు మండల కేంద్రం బేరి శెట్టి కళ్యాణ మండపం లో ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం, అతిథిగా జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, అధికారులు ప్రజా ప్రతినిధులు వై ఎస్ ఆర్ చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి , జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించారు.

శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న తన తండ్రి ఆశయాన్ని నేరవేస్తున్నారని, పేదలు ఇబ్బంది పడరాదనే పంటలకు, పశువులకు బీమా ప్రభుత్వమే చెల్లిస్తూ నష్టపోయిన రైతులను పరిహారం అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులు అందరికీ అందాలనే జగనన్న సురక్ష లో ప్రతి ఇంటికి కావలసిన ధృవ పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టామని అన్నారు. నేడు రూ.105.91 లక్షలతో నియోజక వర్గ స్థాయి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ రైతులకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. మన జిల్లాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వున్నారు, శ్రీసిటీ, అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట వంటివి వున్నాయని అలాగే ఇది కావాలని అడిగితే కాదనకుండా మన జిల్లా కలెక్టర్ వున్నారని, చేస్తున్నారని ధన్యవాదాలు అన్నారు. ప్రతి పేదవాడికి సాయం చేయడం ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. ప్రతి నిత్యం గ్రామాలు ఏదో ఒక కార్యక్రమంతో తిరుగుతున్నాం, ప్రక్క రాష్ట్రాల ప్రజలు ఏమి జరుగుతున్నదని ఆరా తీస్తున్నారు అన్నారు. ఎన్నో పథకాలు పేద కుటుంబాలకు అందిస్తున్నాం అన్నారు. వై ఎస్ ఆర్ మన మధ్య లేకున్నా 13 యేళ్లు గడిచినా స్మరించు కుంటున్నాం అన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో రైతులకు ఆర్ బి కే ఏర్పాటు తో రైతులు వ్యవసాయ శాస్త్ర వేత్తలతో నేరుగా మాట్లాడే అవకాశం, అలాగే నేడు ప్రారంభించు కుంటున్న అగ్రీ లాబ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అలాగే , ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, రైతులు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని అన్నారు. కళ్యాణ మండపం కోసం స్థలం ఇచ్చాం, ఉత్తుకోట బైపాస్ రోడ్డు వంటివి శాసన సభ్యులు పట్టుబట్టి సాధించుకున్నారని ఇలా నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నా రని అన్నారు. వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి ప్రసంగం వీక్షించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా డా. వైఎస్ ఆర్ ఉచిత పంటల బీమా పథకం క్రింద 2022 ఖరీఫ్ సీజన్ పరిహారం శ్రీకాళహస్తి నియోజక వర్గలోని శ్రీకాళహస్తి మండలం 400 మందికి, ఏర్పేడు 112 మంది కి - సత్యవేడు నియోజకవర్గంలో కేవిబి పురం మండలం 27 మందికి, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ 12 మందికి, చిన్నగొట్టిగల్లు 923 మంది, పాకాల 719 మంది మొత్తం 2193 మంది రైతులకు రూ.70,82,237/- మొత్తం రైతులకు ఖాతాలకు జమకానున్న చెక్కు ను శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ , లబ్దిదారులకు అందించారు. అనంతరం రూ. 105.91 లక్షలతో ఏర్పాటు చేసిన జిల్లాలో 5 వ ల్యాబ్ సత్యవేడు నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఘనంగా ప్రారంభించారు. విత్తనాల విశ్లేషణ విభాగం, ఎరువుల విశ్లేషణ విభాగం, ల్యాబ్ లను ప్రారంభించి పరికరాల పనితీరు పరిశీలించారు. విత్తనాల స్వచ్ఛత ప్రమాణాలు, మొలక శాతం, తేమ శాతం వంటివి పరీక్షించి అధిక దిగబడినిచ్చే లక్ష్యంగా రైతులకు అందుబాటులోకి రావడం జరిగింది. ప్రాంగణంలో మొక్కలు నాటి సి హెచ్ సి లలో అందుబాటులో ఉన్న రైతు యంత్ర సేవా పరికరాలను , 1962 పశు ఆంబు లెన్స్ పరిశీలించారు. అలాగే జిల్లాలో నేడు 6 వ ల్యాబ్ సూళ్లూరుపేటలో రూ. 116.5 లక్షలతో నిర్మించి నేటి నుండి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద రావు స్వాగత ఉపన్యాసం చేపట్టగా, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు , ఏడిలు ధనంజయ రెడ్డి, సుబ్రమణ్యం, నాగార్జున , ఏ ఒ మురళి, ఎపి ఎం ఐ పి పిడి సతీష్, తహీల్దార్ జరీనా, ఎం పి డి ఓ జగనన్న సురక్ష స్పెషల్ ఆఫీసర్ చెన్నయ్య , రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: