Thursday, 30 July 2026 01:34:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు..

Date : 13 May 2026 09:00 PM Views : 708

Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు వేసవి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. కానీ ఇప్పుడు అదే మామిడి ప్రజల్లో భయాన్ని పెంచుతోంది.మార్కెట్‌లో బంగారంలా మెరిసే మామిడిపండ్ల వెనుక అసలు నిజం బయటపడుతోంది.సహజంగా చెట్టుపైన మగ్గాల్సిన మామిడి కాయలను గోదాముల్లో రసాయనాలతో గంటల్లోనే పసుపురంగులోకి మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.పుంగనూరు నియోజకవర్గం లో భారీగా సాగుతున్న ఈ కెమికల్ మామిడి దందా ఇప్పుడు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.బయటకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పండ్లు లోపల మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయంటున్నారు వైద్యులు.రోజుల గడిచేకొద్దీ సహజంగా మగ్గాల్సిన మామిడికాయలను.. రాత్రివేళ గోదాముల్లో నిల్వ చేసి రసాయనాల మధ్య కప్పిపెట్టి ఉంచుతున్నారు.తెల్లారేసరికి అవే పండ్లు సహజంగా మగ్గిన మామిడిపండ్ల పేరుతో మార్కెట్‌లోకి చేరుతున్నాయి.రంగు,మెరుపు చూసి ప్రజలు కొనుగోలు చేస్తున్నా.. వాటి వెనుక దాగి ఉన్న ప్రమాదం చాలామందికి తెలియడం లేదు.సహజంగా మగ్గిన పండ్లకు ఉండే వాసన, రుచి, నాణ్యత ఈ కెమికల్ పండ్లలో కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.అయినా తక్కువ సమయంలో ఎక్కువ లాభాల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ రసాయనాలతో మగ్గించిన పండ్లు తింటే కడుపునొప్పి, వాంతులు, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.మరో వైపు ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ప్రమాదకర రసాయనాలతో పండ్లను మగ్గపెట్టడం నిషేధం అయినా కొన్ని గోదాముల్లో యథేచ్ఛగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అధికారుల తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అందుకే బయట దొరికే మామిడి పండ్లు కొనేముందు జర భద్రం.బదులకు మీకు తెలిసిన తోటలు ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోవడం ఉత్తమం.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: