Wednesday, 29 July 2026 05:34:52 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ధన్వంతరీ త్రయోదశి

ఈరోజు నుండి దీపావళీ ఐదు రోజుల పండుగ అంటారు ? వాటి విశేషాలు ఏమిటి ?

Date : 29 October 2024 09:04 PM Views : 967

Famous TV - భక్తి / తిరుపతి : వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు 'ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన 'ధన్వంతరీభగవాన్' జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. నరక చతుర్దశి నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే 'నరకుడు' నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు , కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ ( భూదేవీ అవతారం )తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి ( సత్యభామ ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి'. దీపావళీ రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు. బలిపాఢ్యమి వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి , 'ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై' అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం. యమద్వితీయ సూర్య భగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుఉంటారు.

REPORTER : RAAMU _ FAMOUS TV TPT

RAAMU PAMULA

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: