Sunday, 19 April 2026 05:40:41 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Date : 31 July 2024 02:04 PM Views : 767

Famous TV - భక్తి / తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి ఆలయంలో నేటి నుండి ఆగ‌స్టు 2వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారంజాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :