Famous TV - భక్తి / : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు శ్రీ జె కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో భక్తి భావనకు కృషి చేస్తున్న బాల కేశాలు సన్మానం భక్తి భావనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది మొదట బాలకేశాలను ఘనంగా సన్మానించిన బ్రహ్మానంద చారి అనంతరం సదస్సునుద్దేశించి బ్రహ్మాండచారి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి పలుకూరు గ్రామంలో మాల పేటలో గల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు భక్తి భావన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నందుకు బాలకేశాలను సన్మానించినట్లు బ్రహ్మానంద చారి తెలిపారు ప్రతి ఒక్కరు తమ విలువైన సమయంలో ఒక గంట అయినా భక్తి కోసం కేటాయించాలని సహనం కన్నా సముద్రం గొప్పదని తల్లిదండ్రులను గురువులను పూజించాలని వృద్ధులను పెద్దలను గౌరవించాలని బ్రహ్మానంద చారి తెలిపారు సన్మాన గ్రహిత బాలకేశాలు మాట్లాడుతూ తనను సన్మానించిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగు భాష అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రాజు సెక్రెటరీ భాష భాస్కర్ సుబ్రహ్మణ్యం భక్త బృందం పాల్గొన్నారు
Admin
Famous TV