Famous TV - భక్తి / తిరుపతి : మంగళవారం స్థానిక కమిటీ కార్యాలయంలో కన్వీనర్ సామంచి శ్రీనివాస్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఒకేసారి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు,వినాయక చవితి పండుగలతో నగరంలోని ప్రతి ఇంటా ప్రతి వీధి పండుగ వాతావరణంలో పచ్చటి తోరణాలతో భక్తి పాటలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు! నగరంలోని వినాయక విగ్రహ మండప నిర్వాహకులు అధికారులు కమిటీ సూచించిన "రూట్ మ్యాప్" ప్రకారం సకాలంలో వినాయక సాగర్ కు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపులో పాదచారులకు,నగర ప్రజలకు,శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా మద్యం సేవించకుండా,టపాకాయలు కాల్చకుండా భక్తి శ్రద్ధలతో,భక్తి పాటలతో నిమజ్జనానికి తరలి రావాలన్నారు! వినాయక విగ్రహాల ఊరేగింపులో ఉపయోగించే ట్రాక్టర్లలో,ఎద్దుల బండ్లలో చిన్నపిల్లలను తల్లిదండ్రుల సంరక్షణలో జాగ్రత్తగా తీసుకురావాలన్నారు! వినాయక సాగర్ వద్ద నిమజ్జనం సమయంలో చెరువు సమీపంలోకి చిన్న పిల్లలను పంపకుండా నిర్వాహకులు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Famous TV