Famous TV - భక్తి / తిరుపతి : 18న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18వ తేదీన పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
Admin
Famous TV