Famous TV - భక్తి / తిరుపతి : తిరుమల శ్రీవారిని నేటి శుక్రవారం ప్రాతః కాల సమయంలో అభిషేక సేవలో కుటుంబ సమేతంగా సేవించి దర్శించుకున్న గౌ. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మరియు గౌ.ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి శేష సాయి. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ ఏ.వి ధర్మారెడ్డి స్వాగతం పలుకగా గౌ సుప్రీం కోర్టు జడ్జి, ఆం.ప్ర గౌ. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దంపతులు ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్, ఈఓ తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం వారు తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట పోర్ట్ఫోలియో జడ్జి చిత్తూరు రవినాథ్ కిలారి, జిల్లా జడ్జి జస్టిస్ భీమా రావు, జస్టిస్ ఎం. గురునాథ్ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ కం మూడవ అదనపు జిల్లా జడ్జి, కోర్టు ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనంజయ నాయుడు తదితరులు ఉన్నారు.
Admin
Famous TV