Famous TV - భక్తి / తిరుపతి : శ్రీ శృంగేరి మఠం తిరుపతి విభాగ అధిపతిగా సామాజిక కార్యకర్త జి ఎల్ మనోహర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీరాములు వారి గుడి ఉత్తర మాడా వీధిలో ఉన్న మఠంలో జరిగిన భారతి తీర్థ స్వామి వజ్రోత్సవాలలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే గండ్ర కోట లక్ష్మీ మనోహర్ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశి విశ్వేశ్వర శారదాంబ గుడిలో విశేష పూజా కార్యక్రమాలు, శంకర మఠంలో ఆది శంకరాచార్యులకు అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి పారాయణం జరిగింది. ప్రముఖ ప్రవచన కర్త కుప్ప విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో వేద పండితుల సభలు నిర్వహించినారు. ఆదిశంకరాచార్య గురు పరంపర, శృంగేరి శంకర మఠ భారతి తీర్థ స్వామి, విధు శేఖర భారతి స్వామి వార్ల గురించి విశేషంగా ప్రవచనం అందించారు. ఈ కార్యక్రమాలు ధర్మాధికారి శ్రీ రాళ్లపల్లి రామమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. తిరుపతి శంకర మఠం మేనేజర్ నడింపల్లి కృష్ణ గారు, పూర్ణ చంద్ర సురభి మురళి పాల్గొన్నారు.
Reporter
Famous TV