Wednesday, 28 October 2026 03:54:51 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

టిటిడి అధికారుల తీరు హాస్యాస్పదం!

తిరుపతి

Date : 01 June 2023 03:37 PM Views : 498

Famous TV - భక్తి / తిరుపతి : ఇటీవల... తిరుపతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 22 A (పెద్దకాపు వీధి పరిసర ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ల నిలుపుదల చేస్తూ ఇచ్చిన) జీవోని అధికారికంగా టీటీడీ ప్రకటించడం, స్థానికుల పక్షాన తామంతా ప్రశ్నిస్తే వెంటనే గొప్ప మనస్సుతో ఉపసంహరించుకున్నట్లు "బిల్డ్ అప్" ఇవ్వడం స్థానికులు గమనిస్తున్నారు! తిరుమల కొండకు టాక్సీలను నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న వేలాదిమంది శ్రీనివాసం,విష్ణునివాసం, అలిపిరి,కోనేటికట్ట వద్ద టాక్సీ స్టాండ్ లు ఏర్పాటు చేసుకొని భక్తులను తిరుమలతో పాటు జిల్లాలోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు అలాంటి వారి కడుపు కొట్టే విధంగా 15 సంవత్సరాల పైబడిన టాక్సీలను తిరుమల కొండకు అనుమతించం అనే ఆలోచన టీటీడీ ఉపసంహరించుకోవాలి! తిరుపతి స్థానిక టాక్సీ డ్రైవర్లకు ఘాట్ రోడ్డు ప్రయాణం పై పూర్తి అవగాహనతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అనేక సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్లకు ఘాట్ రోడ్ మలుపుల అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అలాంటి వాహనాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టాలి! టీటీడీ అధికారుల,అధికార పార్టీ నాయకుల తీరు చూస్తే తిరుపతి ప్రజలపై ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక సమస్యను సృష్టించడం స్థానికులపై ఒత్తిడి తీసుకురావడం కాళ్ల బేరానికి రప్పించుకోవడం తామే సమస్యను పరిష్కరించినట్లు చిల్లర డ్రామాలు ఆడటంతో టిటిడి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్నారు! తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదాల నివారణకు.... 1) టీటీడీ,RTO అధికారుల సమన్వయంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనాల "ఫిట్ నెస్" ను పరిశీలించండి,డ్రైవర్లకు "హెవీ వెహికల్" లైసెన్స్ ఉందా లేదా అని తనిఖీలు చేసే నాధుడే లేకపోవడం ప్రమాదాలకు మూల కారణం! 2) తిరుమల ఘాట్ రోడ్ లో టీటీడీ నిబంధనల ప్రకారం 28 నిమిషాలు తిరుమల కొండకు వెళ్లేందుకు అలాగే తిరుపతికి 40 నిమిషాలు సమయపాలన పాటించాలి అని ప్రైవేటు వాహన డ్రైవర్లకు తెలిసేలా ఘాట్ రోడ్ లో ఎక్కడ "సూచిక బోర్డులు" ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు! 3) టిటిడి అధికారులు రెండు ఘాట్ రోడ్డులలో "స్పీడ్ లిమిట్ కెమెరాలను" ఏర్పాటు చేసి స్పీడు లిమిట్ ను అతిక్రమించిన వాహనాలకు జరిమానా విధిస్తే ప్రమాదాల నివారించవచ్చు! 4) తిరుమల రెండు ఘాట్ రోడ్లలో అక్కడక్కడ విజిలెన్స్ సెక్యూరిటీ, తిరుమల పోలీస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి అతి వేగంగా నడిపే వాహనాల స్పీడుకు జరిమానాలతో కళ్లెం వేయండి! 5) తిరుమల కొండకు 15 సంవత్సరాల పైబడిన ట్యాక్సీలను నియంత్రించాలని ఆలోచిస్తున్న టిటిడి కచ్చితంగా వారం రోజుల లోపల ఉపసంహరించుకోవడం తథ్యం అని స్థానిక సమస్యలపై "పొగ పెట్టడం నీళ్లు చల్లడం" టీటీడీ కి పరిపాటిగా మారిందని నవీన్ ఎద్ధవా చేశారు! నవీన్ కుమార్ రెడ్డి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ స్థానికులు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: