Wednesday, 29 July 2026 08:06:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు

Date : 12 June 2023 04:44 PM Views : 454

Famous TV - భక్తి / తిరుపతి : సమస్య ఏదైనా అక్కడ సేవలు అందించేది పోలీసులే. ఇదే క్రమంలో చెంగాలమ్మ జాతరలో గాయపడిన ఒక అబ్బాయిని కాపాడి, మానవత్వానికి ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనం పోలీసులే అనే నినాదాన్ని చాటి, ప్రజల వద్ద ప్రశంసలు పొందారు.. తిరుపతి జిల్లా  సూళ్లూరుపేటలో చెంగాలమ్మ అమ్మవారి జాతర అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరుగుతుంది. ఈ జాతరను వీక్షించడానికి రాష్ట్ర నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తుంది. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని,  సూళ్లూరుపేట  పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి  ఉన్నారు. వారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి రాజగోపాల్ రెడ్డి గారు అక్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు..        ఈ క్రమంలో నిన్నటి దినం సుమారు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అనుకొని విధంగా గాలి వాన విపరీతంగా రావడంతో కరెంటు సరఫరా లేక ఆలయ ప్రాంగణం అంతా చీకటి మయం అయిపోయింది.. అదే సమయంలో అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఒక యువకుడు చిమ్మ చీకటిలో అనుకోకుండా ఫెన్సింగ్ నందు కాలు పెట్టడం వల్ల ఇరుక్కుని అతని పాదాలకు బలమైన గాయం కలిగి విపరీతంగా రక్తస్రావం అవడం వలన సృహ తప్పే స్థితికి వచ్చాడు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ వారు గుర్తించి అధిక రక్త స్రావం జరగకుండా చూసి తమ పోలీసు వాహనంలో రక్త గాయాలతో బాధపడుతున్న అతనిని హుటాహుటిన ఒకపక్క జాతర అదే సమయంలో విపరీతమైన రద్దీ చిమ్మ చీకటి వీటన్నిటిని కూడా లెక్క చేయక ఒక గ్రీన్ ఛానల్ లాగా ఏర్పాటు చేసుకొని చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు...తరలించడమే కాక దగ్గరుండి ఆ అబ్బాయి కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు అతనికి సేవలందించారు.. ఈ ఘటనను కళ్లారా చూసిన ప్రజలు పోలీసులను ప్రశంసలతో ముంచేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :