Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట, అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా నాల్గవరోజు 15-02-2024 (గురువారంవారం)పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 4:00 గంటల నుండి 5:00గంటల మధ్య శ్రీ కోదండరామ స్వామి వారు, శ్రీ సీతామహాదేవి, శ్రీ లక్ష్మణ స్వామి వారు ,శ్రీ దాసాంజనేయ స్వామి వార్ల యంత్ర విగ్రహ స్థాపనలు అంగరంగ వైభవంగా ప్రతిష్టించబడ్డాయి. అలాగే నేత్ర బంధనము,అఖండ దీపస్థాపనము,కవాట బంధనము,గణపతి పూజ మొదలైన కార్యక్రమాలను నిర్వహించారు.ఉదయం 8:00 గంటల నుండి గోపూజ,విశేష హవనములు,ప్రధాన కలశముల శోభాయాత్రను జరిపి, 9:15 ని" సమస్త ప్రతిష్ట దేవతామూర్తులకు మహా కుంభాభిషేకము నిర్వహించారు .అలాగే పూర్ణాహుతి స్నానము ,ఆశీర్వచనము,పండిత సత్కారములను నిర్విఘ్నంగా పూర్తి చేశారు.ఉదయం 10: 30 నిమిషాలకు స్వర్గాన్ని తలపించేలా అంగరంగ వైభవంగా గల్లా జయదేవ్ దంపతులు, గల్లా రామచంద్ర నాయుడు దంపతులు గౌరినేని రమాదేవి దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. భక్తాదుల శ్రీ రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఇలా కనుల పండుగ పేటమెట్ట గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట - కుంభాభిషేకమహోత్సవములు జరిగాయి.స్వామివారి సేవలో గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి గౌరినేని ప్రసాద్, గౌరీనేని రమాదేవి,గౌరీనేని హర్షవర్ధన్, గౌరీనేని విక్రమ్, గల్లా అశోక్, గల్లా సిద్ధార్థ తదితర గల్లా మరియు గౌరినెని కుటుంబ సభ్యులు మరియు తెలుగుదేశం సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్,పుత్తూరు తెలుగుదేశం ఇంచార్జ్ గాలిభాను ప్రకాష్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు, పూతలపట్టు తెలుగుదేశం ఇంచార్జ్ మురళీమోహన్ మరియు పేట మిట్ట గ్రామ ప్రజలు మరియు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
Admin
Famous TV