Famous TV - భక్తి / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలము,దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు 04-10-2025న శనివారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 68 రోజులకు గాను నగదు రూపంలో రూ. 62,21,142.00, బంగారు 72-000 గ్రాములు, వెండి 705-000 గ్రాములు, ఫారెన్ కరెన్సీ - 1) Central Bank of Kuwait (1/4 dinar) - 2 Notes, 2) Central Bank of Kuwait (1 dinar) - 1 Note, 3) Central Bank of Kuwait (5 dinar) - 1 Note, 4) Bank of Canada (50 dollars) - 1 Note, 5) Bank of Korea (1000 Won) - 1 Note మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 46,310.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, చిత్తూరు జిల్లా, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమీషనరు చిట్టెమ్మ, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చౌడేపల్లి వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Famous TV