Famous TV - భక్తి / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం లోని పుదిపట్లలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ఏడవ రోజు శ్రీ లఘు వైష్ణవి అలంకారంలో దర్శనమిచ్చిన వైష్ణవి దేవి ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్న వారికి భయ నివారణ రక్షణ విజయం భూ గృహ సమస్య పరిష్కారం జరుగును ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం చేశారు. చౌడేపల్లి పుంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఉభయదారులుగా పుంగనూరుకు చెందిన రామస్వామి రెడ్డి ధర్మపత్ని మాధవి వ్యవహరించారు.
Admin
Famous TV