Saturday, 13 June 2026 11:03:10 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

తిరుమల శ్రీవారి సేవల కోటా విడుదల తేదీలు ఇవే..!

Date : 14 August 2024 07:40 AM Views : 806

Famous TV - భక్తి / తిరుపతి : ఆగష్టు 19న నవంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగష్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఆగష్టు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను, అదేవిధంగా నవంబరు 9న శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పుష్పయాగం సేవ టికెట్లను ఆగష్టు 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆగష్టు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు…. నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగష్టు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా…. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను ఆగష్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఆగష్టు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఆగష్టు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల నవంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌… తిరుమల, తిరుపతిల‌లో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల ఆగష్టు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :