Thursday, 30 July 2026 09:30:28 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా పేటమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు ప్రారంభం

Date : 12 February 2024 05:33 PM Views : 771

Famous TV - భక్తి / చిత్తూరు : పూతలపట్టు,పేటమిట్ట, అమరరాజ సంస్థల అధినేత డాక్టర్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు తమ స్వగ్రామమునందు శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానాన్ని నిర్మించి, స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలను ఈరోజు నుంచి నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా 12-02-2024 (సోమవారం )పూతలపట్టు మండలంలోని పేటమిట్టలో ఉదయం 9 గంటలకు ప్రతిష్టించబోయే సమస్త దేవత విగ్రహములను పేటమిట్ట ,గణపతి రాపూర్ పోటు కనుమ ,కర్ణం వారి పల్లి మరియు కోట్లపల్లి గ్రామాల్లో ఘనంగా ఊరేగించారు.అలాగే ఉదయం 10 గంటలకు శ్రీమతి గల్లా అరుణ కుమారి ,శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గార్లు తమ స్వగృహం నుండి మంగళ వాయిద్యాలతో విరూపాక్షమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలను సమర్పించి, యాగశాలకు చేరుకుని గోపూజ, శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాంచన, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.సాయంత్రం నాలుగు గంటలకు శాలా వాహన , శోడశస్తంభార్చన, అఖండదీపార్చన, వాస్తు మండపారాధన, వాస్తు హోమము, వాస్తు పర్యగ్నికరణము, వాస్తు బలి ,క్షేత్రపాలక ,యోగిని ,నవగ్రహ మండపారాధన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.రాత్రి 8 గంటలకు తీర్థప్రసాదాలు స్వీకరించి ,పండరి భజన మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తాదుల రామనామ స్మరణతో మొదటిరోజు కార్యక్రమం ముగిసింది.స్వామి వారి సేవలో శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు,శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా రాధాకృష్ణ సర్పంచ్, ట్రస్ట్ సెక్రటరీ గల్లా రాజశేఖర్, ట్రెజరర్ గల్లా రామానాయుడు, సభ్యులు భానుమూర్తి నాయుడు, గల్లా రాజగోపాల్ , గల్లా సంపత్ నాయుడు , ఇతర ట్రస్ట్ సభ్యులు, పేటమిట్ట మరియు సమీప గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: