Famous TV - భక్తి / తిరుపతి : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నవరాత్రి కొలువు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రాత్రి వాహనసేవ అనంతరం ఒక గంట పాటు ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కొలువు జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పెద్దశేష వాహనంపై ఆశీనులను చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ధూపం, దీపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం సమర్పించి శోడషోపచారాలు చేస్తారు. ఇందులో వేదపండితులు దివ్యప్రబంధాన్ని పఠిస్తారు. చివరగా అర్చకులకు శఠారి, బహుమానం సమర్పిస్తారు. వాహనసేవల్లో అలసిపోయిన స్వామి, అమ్మవార్లకు ఉపశమనం కల్పించేందుకు ఈ కొలువు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఆకట్టుకున్న బొమ్మల కొలువు నవరాత్రి బ్రహ్మోత్సవాల మొదటిరోజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రంగనాయకుల మండపాన్ని ఆపిల్స్, కట్‌ఫ్లవర్లు, సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితోపాటు దశావతారాల బొమ్మలను కొలువుతీర్చారు.
Admin
Famous TV