Famous TV - భక్తి / తిరుపతి : టీటీడీ ఉద్యానవన విభాగానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వారు రూ.4.10 లక్షల విలువైన ఎరువులను సోమవారం విరాళంగా అందించారు.కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఆర్ఎం రమణారెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ మురళి ఈ మేరకు ఎరువులను తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులుకు అందజేశారు. తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులను వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీ మధు, శ్రీ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
Famous TV