Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి మండలం లోని చారాల సమీపాన దొనబండ పైన వెలసి ఉన్న అన్నపూర్ణాంబ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకల లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఆదివారం న ఉదయం 8 గంటలకు స్వామి వారికి పంచామృతాభిషేకం,అర్చన,మహా మంగళ హారతి, మద్యాహ్నం 3 గంటలకు ఉట్లోత్సవం జరిగింది.ఉట్లు కొట్టడానికి నువ్వా,నేనా అని పోటీపడి ఉట్లు కొట్టినారు.అనంతరం పాకమాను ఎక్కారు.సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరిగుతుంది.రాత్రి 9 గంటల పైన స్వామివారి రథోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా,భాజా భజంత్రి లతో స్వామివారు వృషభ వాహనం పై ఊరేగుతాడని,సోమవారం ఉదయం 9 గంటలకు దోపోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి చారాల గ్రామానికి చెందిన వారు ఎక్కడ ఉన్ననూ ఖచ్చితంగా ఈ రథసప్తమి వేడుకలకు విచ్చేసి తమ మొక్కులు తీర్చుకొనుట ఆనాటి నుండి ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమాలు జరిగే మూడు రోజులు గ్రామం అంతా బంధువులతో కళకళలాడుతుంది.ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి ఆంద్ర నుండే కాకుండా అటు కర్ణాటక,ఇటు తమిళనాడు నుండి భక్తులు తరలివచ్చారు.
Admin
Famous TV