Famous TV - భక్తి / తిరుపతి : అక్టోబర్ 22: తిరుచానూరు నవజీవన్ శరణాగతి వృద్ధాశ్రమంలో దసరా బొమ్మలకొలువు అత్యంత వైభవంగా జరుగుతోంది. నవజీవన్ పాటసాలలోనున్న అంధ విద్యార్థులు స్పెషల్ చిల్డ్రన్ ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో దసరా నవరాత్రి అమ్మవార్లను కొలుస్తున్నారు.. రోజుకు ఒక అలంకరణ దరింపచేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను కొలవడం,విష్ణు సహస్ర పారాయణం,లలిత సహస్ర పారాయణం,అమ్మవారి పాటలు భజనలు చేస్తూ ఆ అమ్మవారిని ఆనందింప చేస్తున్నారు..చిన్నారులతో పాటుగా నవజీవన్ శరణాగతిలో ఉన్న వృద్దులు ఎంతో చక్కగా అమ్మవారి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉన్నారు.వృద్ధాప్యం లో చక్కటి కాలయాపన దిశగా నవజీవన్ నిర్వహించు ప్రతి కార్యక్రమం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని వారి చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి అని వృద్దులు తెలిపారు. దేవీ నవరాత్రులు నవజీవన్లో ఉన్న ప్రతి ఒక్కరు కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆనందంగా ఒక నవజీవన్ కుటుంబంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ,పిల్లలు కల్లతోచూడలేకపోయిన వారికి ఆ అమ్మవారి అనుభూతిని అందించి అమ్మవారి కృప ఎప్పుడూ పిల్లలకు ఉంటుందని నవజీ పౌండర్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ .కె. శ్రీధర్ ఆచార్యగారు తెలిపారు.నవాజీవన్ ఉన్న పిల్లలు అందరూ కలిసి ఈ పనులు చేయడం మన సంస్కృతి సాంప్రదాయ విలువలు తెలుసుకొని వాటిని పాటించడం చాలా సంతోషం అని తెలిపారు. వృద్ధులు తమ బాల్యాన్ని గుర్తు చేసేవిధంగా సంతోషంగా ఉంటారు అని తెలిపారు...కాలక్షేపం ,భక్తి శ్రద్ధ,మోక్షం అన్ని ఆ అమ్మవారే కల్పిస్తారని ,ఆ దుర్గా మాత అనుగ్రహం అందరికీ కలగాలని శ్రీధర్ ఆచార్య గారు తెలిపారు.పిల్లలు,వృద్ధులు,నవజీవన్ పరివార్ అందరూ కలిసి ఎంతో చక్కగా సాయంత్రం వేళలలో అందరినీ పిలిచి తాంబూలం ఇచ్చి రోజుకొక ప్రసాదం చేసి అందరికీ ఇవ్వడం గౌరవించడం జరుగుతోంది.ఇందులో కన్యా పూజ మరియు సుమంగళి పూజ,లక్ష్మి పూజ ఎంతో చక్కగా సరస్వతీ పూజ చేస్తారు.పిల్లలందరికీ కొత్త గాజులు,దండలు ,కమ్మలు,బట్టలు పెట్టీ నలుగు పెట్టి అలంకరిస్తారు.ఆ ఆదిపరాశక్తి ఈ పిల్లల్లో ఉంది అని వారు అందరూ పూజిస్తారు...శ్రీమతి కౌసల్యాదేవి గారు నావజీవన్ లో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకు తాంబూలం ఇచ్చి గౌరవిస్తారు.నావజీవన్ వృద్ధాశ్రమం లో ఉన్న అన్నస్వామి గారు పిల్లలు అందరికీ ఇస్ క్రీమ్స్,మిఠాయిలు రోజు ఇవ్వడం పిల్లలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అన్నాస్వామి గారు ప్రతి ఏడాది పిల్లలకు అందరికీ బట్టలు ఇచ్చి ఆశీర్వదిస్తారు..ఇందులో భాగంగానే నవజీవన్ శరణాగతి లో ఉన్న పెద్దలు శాంత మాడెం మరియు ఇందిరమ్మ,కుసుమమ్మ,సుగుణమ్మ,మైథిలి అమ్మ,శాంతా అమ్మ,జయలక్ష్మి,వత్చల అమ్మ,రమణి అమ్మ,రాజగోపాల్ గారు , రంగా రావు గారు,ప్రసాద్ గారు,లక్ష్మణ శెట్టి,సంతానం గారు అందరూ కలిసి పిల్లలను చక్కగా ఆశీర్వదించి భజనలు చేస్తున్నారు... నవజీవన్ సెక్రటరీ ఆర్.శ్రీనివాసన్ ,శ్రీమతి చంద్రశ్రీనివాసన్ గారు పిల్లలకి పెద్దలకి అందరికీ రోజు వారికి అవసరమైన ప్రతి ఒక్కటి అందించడం లో ముందుంటారు ఆని నవజీవన్ పెద్దలు చెప్పారు..ఈ బొమ్మల కొలువును నిర్వహించడం లో కీలక పాత్ర పోషించి అన్ని రెఢీ చేయడం లో ముందుండి నడిపిస్తున్న నవజీవన్ శరణాగతి వృద్ధాశ్రమం ఇంఛార్జి ఏ.శ్రీనివాసన్ వారి శ్రీమతి డాక్టర్ నెల్లూరు.మునిలక్ష్మి గారిని శ్రీధర్ ఆచార్యగారు అభినందించి సత్కరించారు.ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు నవ దుర్గలు,తిరుమల కొండ ఆ శ్రీనివాసుడు,సకల దేవతలు ,బృందావనం,అన్ని కొలువైన విధంగా ర్పాటు చేశారు.శ్రీవారి మెట్లు,పద్మావతి అమ్మవారు, కుబేరుడు,సెట్టియార్,దశావతారం,పెళ్లి బొమ్మలు,ఆట బొమ్మలు,గోపికల బృందం,ఇలా ప్రతి ఒక్కటి పెట్టడం చాలా ఆనందంగా ఉందని తిరుమల కొండ మొత్తం న్యూస్ పేపర్స్ తో మాత్రమే చక్కగా తయారు చేసి కర్చులేకుండ ఇలా పిల్లలకు,పెద్దలకు,ఆనందాన్ని పంచేలా చేయడమే తన ఆలోచన అని డాక్టర్ నెల్లూరు మునిలక్ష్మి తెలిపారు ఇందులో సహాయంగా తన కుమారుడు చిరంజీవి వేంకట భరద్వాజ్,కుమారి తేజశ్రీ,శ్రీనిధి సహాయం చేసారని తెలిపారు..."అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి" అని డాక్టర్ నెల్లూరు మునిలక్ష్మి తెలిపారు.
Admin
Famous TV