Famous TV - జాతీయ వార్తలు / : దుబాయ్ దేశంలో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 24 - 05 - 2023 తేదీన నిర్వహిoచిన కల్చరల్ సన్నోయిట్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ U.A.E. 2023 భాగంగా.వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన తెలుగు వారిని గుర్తించి వారికి అంతర్జాతీయ పురస్కారంను అందచెయ్యడం జరిగింది. అందులో భాగంగా హాబితత్ ఆడిటోరియం ,అజ్మన్ నందు తిరుపతి పట్టణానికి చెందిన అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వే ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ .పైడి అంకయ్య గారు నిత్యం సమాజ శ్రేయస్సు కాంక్షించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వేలాదిమంది సామాజిక సేవకులను ప్రోత్సహిస్తూ సామాజిక సేవలో అందరికీ ఆదర్శంగా నిలిచిన డా. పైడి అంకయ్య గారికి తెలుగు సేవా సామ్రాట్ పురస్కారాన్ని దుబాయ్ దేశం ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీ పీచా కిరణ్ గారు,మలేసియా తెలుగు సంఘము నుండి రామా గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందచేసారు.
ఈ సందర్భంగా డా౹౹ పైడి అంకయ్య మాట్లాడుతు నన్ను గుర్తించి అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసి దుబాయ్ దేశంలో కల్చరల్ సన్నోయిట్ మరియు ఇంటర్నేషనల్ అవార్డ్స్ U.A.E. 2023 కార్యక్రమంలో నాకు తెలుగు సేవా సామ్రాట్ పురస్కారాన్ని పెద్దల చేతులమీదుగా అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. వే ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 7 దేశాలలో భారతీయ సంస్కృతిని,సంప్రదాయాలను గుర్తు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నాకు ఈ అవార్డ్ రావడానికి మరియు నన్ను నేను సమాజంలో సేవ చెయ్యడానికి నాకు అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తూన్న ,నా కుటుంబ సభ్యులకు మరియు వే ఫౌండేషన్ టీమ్ సభ్యులకు , దాతలకు , నా శ్రేయోభిలాషులకు ,నా స్నేహితులకు ,నా తోటి సమాజ సేవకులకు, మరియు పత్రికా విలేకర్లకు ,ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.
Admin
Famous TV