Monday, 14 September 2026 07:01:02 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

'ఇండియా' కూటమి తొలి భేటీకి ముహూర్తం ఖరారు

Date : 20 July 2023 08:42 AM Views : 521

Famous TV - జాతీయ వార్తలు / : దిల్లీ: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరుకు జట్టు కట్టిన ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ (INDIA- ఇండియా) అనే పేరును ప్రకటించాయి.. ఈ క్రమంలో ఇండియా కూటమి తొలి సమావేశం గురువారం జరగనుందని తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఛాంబర్‌లో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశం కానున్నారు. గురువారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై సమన్వయంతో వ్యవహరించాలని రెండు రోజులపాటు బెంగళూరులో జరిగిన భేటీలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈ క్రమంలో మరోసారి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. 26 పార్టీల ఇండియా కూటమికి లోక్‌సభలో 150 మంది సభ్యులు ఉండగా, ఎన్డీయేకు 330 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో ఈ విడత పార్లమెంటు సమావేశాలు ఆసక్తిగా కొనసాగే అవకాశముంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :