Tuesday, 15 September 2026 09:24:42 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్‌ మరొకటి లేదు!

12 ఏళ్ల నిర్మాణం 700 ఎకరాల విస్తీర్ణం

Date : 20 June 2023 07:08 AM Views : 483

Famous TV - జాతీయ వార్తలు / : ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాలెస్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది ప్యారిస్‌లోనో లేదా వేరే ఇతర దేశాల్లోనో ఉంటుందనుకుంటారు. కానీ ప్రపంచంలోనే చాలా పెద్దదైన ప్రైవేట్ ప్యాలెస్ భారతదేశంలోనే ఉంది. అదే 'లక్ష్మీ విలాస్ ప్యాలెస్' (Laxmi Vilas Palace). ఈ ప్యాలెస్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ వేలకోట్లలో ఉంటుంది.

వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్‌గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్‌ను గుర్తు చేస్తుంది.ప్రస్తుతం ఈ ప్యాలెస్ రాజకుటుంబానికి హెచ్‌ఆర్‌హెచ్ సమర్జిత్‌సిన్హ్ గైక్వాడ్ నాయకత్వంలో ఉన్నట్లు సమాచారం. ఈయన రాధికారాజే గైక్వాడ్‌ను వివాహం చేసుకున్నారు. హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్‌హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం.170 గదులతో కూడిన ఈ ప్యాలెస్ లోపల గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దర్బార్ హాల్ వెనీషియన్ మొజాయిక్ ఫ్లోర్‌, వెలుపల నీటి ఫౌంటైన్‌లతో కూడిన విశాలమైన తోట ఉంది. అంతే కాకుండా ఇందులో పాత ఆయుధాలు, శిల్పాలతో మ్యూజియం ఉంది. ఇందులో ప్రేమ్ రోగ్, దిల్ హి తో హై, సర్దార్ గబ్బర్ సింగ్, గ్రాండ్ మస్తీ వంటి అనేక సినిమా షూటింగులు జరిగాయి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :