Famous TV - జాతీయ వార్తలు / : గత వారం క్రితం తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ని తనిఖీ చేసిన ఎంపీ మద్దిల గురుమూర్తి సమస్యల సత్వర పరిష్కారానికి నేడు ఢిల్లీలో ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ డా.రాజేంద్ర కుమార్ (ఐఏఎస్)ని కలిశారు. ఈ సందర్బంగా తన తనిఖీలో కనీస మౌళిక వసతులు లేని విషయాన్ని గమనించానని ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళకి దీటుగా సేవలు అందించే విధంగా సిద్ధం చేయాలని కోరారు. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో అధునాతన వైద్యపరికరాలు లేనందువలన సకాలంలో మెరుగైన వైద్యం అందడంలో జాప్యం జరుగుతుందని తద్వారా రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సత్వరమే తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో అదునాతన వైద్యాన్ని ప్రవేశ పెట్టి రోగులకు అందించాలని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న హాస్పిటల్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అలాగే శ్రీ సిటీలో నిర్మించనున్న ఈఎస్ఐ హాస్పిటల్ పనులు వేగవంతం చేయాలని ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ ని కోరారు.
Admin
Famous TV