Famous TV - జాతీయ వార్తలు / : కరకంబాడి అమర రాజా విద్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథి అమర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గౌరినేని రమాదేవి గారు మాట్లాడుతూ మన స్వేచ్ఛ, మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనము స్మరించుకోవాలని, వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలని తెలియజేశారు. మన దేశం సాంకేతికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిందని ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఈనాటి విద్యార్థులే రేపటి అభివృద్ధికి కారణమని తెలిపారు.2023-24 విద్యా సంవత్సరానికి పదవ తరగతి పరీక్షలలో మొదటి ఐదు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విచ్చేసి అందరినీ ఆకర్షితులను చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తిని చాటేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ దేవప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV