Friday, 19 June 2026 02:10:27 PM
# భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన

విమానాల మరమత్తు, నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్ కంపెనీ

విమానాశ్రయంలో మౌళిక సదుపాయాల పరిశీలన, అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తితో భేటీ

Date : 28 September 2023 02:13 PM Views : 618

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమత్తు, నిర్వహణ చేపట్టేందుకు ఉద్దేశింపబడిన ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం గతంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరిపిన విషయం విదితమే. గతంలో హైదరాబాద్ లో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా శిఖరాగ్ర సమావేశం వేదికగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం ఔత్సాహిక కంపెనీలను టెండర్లకు ఆహ్వానించడం జరిగింది. ఇదిలా ఉండగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని సందర్శించారు. తదుపరి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో తిరుపతి లోని వారి కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద నగరాలతో దీటుగా తిరుపతి నగరాన్ని మరియు తిరుపతి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపేందుకుగాను రూపొందించబడిన ప్రణాళికలో భాగంగా తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేసారు. ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ వారు వారి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారని రానున్న 6 నెలల సమయంలో ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ఎంపీ గురుమూర్తి అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: