Saturday, 12 September 2026 02:04:40 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

వాతావరణ మార్పుల ప్రభావం నుండి పర్యావరణాన్ని కాపాడుకోవాలి - తిరుపతి ఎంపీ గురుమూర్తి

పులికాట్ ముఖ్యద్వారం పూడికతీయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం

Date : 05 June 2023 04:36 PM Views : 475

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం బీమునివారి పాలెం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అటవీ శాఖ ఆదర్వంలో "మడ చెట్లు" నాటే కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హాజరయ్యారు. వాతావరణ మార్పుల ప్రభావం నుండి పర్యావరణాన్ని కాపాడటానికి సమాజాన్ని చైతన్య పరచడం కోసం ఆలాగే వనరులను విచక్షణా రహిత మరియు విధ్వంసం చేసే విధంగా వినియోగించేలా ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ద్వారా "మిషన్ లైఫ్" కార్యక్రమం రూపొందించబడింది. "మిషన్ లైఫ్" కార్యక్రమంలో భాగంగా "మడ అడవులు" అభివృద్ధి చేయడం ద్వారా తీర ప్రాంతం కోతకు గురవకుండా ఉంటుందని ఆలాగే సముద్రానికి అనుసంధానంగా ఉండే ఏరులు, వాగులకి ఇరువైపులా కూడా ఈ చెట్ల పెంపకం జరుగుతుందని తద్వారా మత్స్య సంపద కూడా వృద్ధి చెంది మత్స్య కారులకు ఉపయుక్తంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలియజేసారు.

ముఖ్యంగా "మిషన్ లైఫ్"లో భాగంగా.. ☑️ శక్తి వనరులను పొదుపుగా వాడటం. ☑️ నీటిని పొదుపుగా వాడటం. ☑️ డిస్పోజబుల్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం. ☑️ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడం. ☑️ సుస్థిరమైన ఆహార పద్ధతులను అలవర్చుకోవడం ☑️ వ్యర్థాలను తగ్గించుకోవడం. ☑️ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవడం వంటి ప్రధాన అంశాలపై అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ "మడ అడవులను" అభివృద్ధి పరచడం పర్యావరణ సమతుల్యం దెబ్బ తినకుండా కాపాడవచ్చని అన్నారు. గూడూరు నియోజకవర్గం రాయదొరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తొలగించే కార్యక్రమంకి సంబంధించి ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీతో కలవడం జరిగిందని ఆయన వెంటనే కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ రాశారని అక్కడ నుండి అనుమతి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతితో రూ.128 కోట్లు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో) పూడిక తీత పనులు మొదలవుతాయాని చెప్పారు. మత్స్యకారుల ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారికి తెలియజేశారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: