Wednesday, 29 July 2026 11:33:10 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్‌!

Date : 24 September 2023 11:39 AM Views : 503

Famous TV - జాతీయ వార్తలు / : దేశీయంగా విమాన ప్రయాణాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల్లో ఆహార పదార్థాలు, పానీయాల కోసం ప్రయాణికుల నుంచి అత్యధికంగా వసూలు చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేయడంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌ దిగొచ్చింది. ఇండిగో విమానంలో సాఫ్ట్‌ డ్రింక్‌ కావాల్సిన ప్రయాణికుతో బలవంతంగా స్నాక్స్‌ కొనిపిస్తున్నారని, విడిగా సాఫ్ట్‌ డ్రింక్స్‌ ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ స్వపన్‌దాస్‌ గుప్తా ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ట్రాల పేరుతో ప్రయాణికులను పిండడం మానేయాలని ఆ విమానయాన సంస్థకు హితవు పలికారు.ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో​ స్నాక్స్‌ అనుభవాన్ని అందించడానికి తమ సేవలను పునరుద్ధరించినట్లు ఇండిగో ప్రతినిధి తాజాగా తెలిపారు. ఇ‍క క్యాన్లలో పానీయాలు విక్రయించడం నిలిపివేసినట్లు చెప్పారు. వేలాది క్యాన్‌ వ్యర్థాలను అరికట్టే తమ గో గ్రీన్‌ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానాలలో క్యాన్లలో పానీయాల విక్రయం ఎప్పటి నుంచి నిలిపివేసిందో ఇండిగో ఎయిర్‌లైన్ పేర్కొనలేదు. ఉచితంగా సాఫ్ట్‌ డ్రింక్‌ ఇండిగో ఎయిర్‌లైన్ ప్రకటన ప్రకారం.. కస్టమర్‌లు ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేసిన ఏదైనా స్నాక్‌తో కాంప్లిమెంటరీ పానీయాన్ని (ఉచితంగా) ఆస్వాదించవచ్చు. దేశీయ విమానయాన మార్కెట్‌లో 63 శాతానికిపైగా వాటాతో ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :