Tuesday, 15 September 2026 07:32:20 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

సీమా హైదర్‌కు పాక్‌ సైన్యంతో సంబంధాలు!

Date : 19 July 2023 06:14 PM Views : 466

Famous TV - జాతీయ వార్తలు / : దిల్లీ: పబ్జీ ఆడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) యువకుడు సచిన్‌ మీనాను ప్రేమించి వీసా లేకుండా నలుగురు పిల్లలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్ కేసులో మరికొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.. ఆమెకు పాకిస్థాన్‌ సైన్యంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీమా భర్త గులామ్‌ హైదర్‌ ఓ భారతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సీమా హైదర్‌ సోదరుడు ఆసిఫ్‌ పాకిస్థాన్‌ సైన్యంలో చేరాడని, ఆమె బంధువు పాక్‌ సైన్యంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్నట్లు తెలిపాడు. సీమా సోదరుడు కరాచీలో పనిచేస్తున్న సమయంలో అతణ్ని కలుసుకున్నట్లు గులామ్‌ తెలిపాడు. అయితే, అతడు ప్రస్తుతం పాక్‌ సైన్యంలో పనిచేస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పాడు. అలాగే, ఆమె బంధువు ఇస్లామాబాద్‌లోని పాక్‌ సైనిక కార్యాలయంలో పనిచేస్తున్నట్లు గులామ్‌ తెలిపాడు.. గత రెండు రోజులుగా సీమా హైదర్‌తోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనా, అతడి తండ్రిని యూపీ ఏటీఎస్‌ అధికారులతోపాటు, ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఆమెకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమా పేరిట ఉన్న పాకిస్థాన్‌ గుర్తింపు కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటితోపాటు ఆమె పాస్‌పోర్ట్‌, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :