Tuesday, 15 September 2026 08:21:30 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

ఎంపీ గురుమూర్తి లేఖకు కేంద్రం సానుకూల స్పందన

తిరుపతి, విజయవాడలలో ఎంఎస్ఎంఇ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ కార్యాలయం ఏర్పాటు చేయమని గతంలో వినతి

Date : 15 December 2023 08:28 PM Views : 647

Famous TV - జాతీయ వార్తలు / : పారిశ్రామికంగా తిరుపతి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్యమనే తలంపుతో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా తిరుపతి జిల్లాలో ఎంఎస్ఎంఇ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయమని కోరుతూ కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ హైదరాబాద్ లోని ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ మరియు ఫెసిలిటేషన్ కార్యాలయ అడిషనల్ కమిషనర్ ని తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడం జరిగింది. ఆ మేరకు సాద్యాసాధ్యాలపై విచారణ జరిపేందుకు పరిశ్రమల కమిషనరేట్ నుండి జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా పరిశ్రమల శాఖ కమిషనర్ మంగళగిరి వారిని ఈ-మెయిల్ ద్వారా ఆదేశిస్తూ నిర్ణీత కాలం లోపల నివేదిక సమర్పించమని కోరడం జరిగింది. తదనంతరం జిల్లా కలెక్టర్లు లేదా ఏపీఐఐసితో సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యాలయం స్థాపించడానికి అవసరమైన భూమిని కూడా త్వరగా గుర్తించాలని కోరారు. ఈ నేపథ్యంలో వీరి ఆదేశాల మేరకు ఈ నెల 21వ తారీఖున విజయవాడలో 22 ,23వ తారీఖులలో తిరుపతిలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ పర్యటించనున్నదని అధికారిక సమాచారం. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన పారిశ్రామికంగా తిరుపతి జిల్లా పారిశ్రామికంగా మరింత పురోగతిని సాదిస్తుందని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే పురోగతి సాధ్యమని తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: