Thursday, 30 July 2026 03:52:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

హర్షవర్ధన్ రెడ్డికి "శక్తి ఆచార్య" జాతీయ అవార్డు

Date : 26 October 2025 11:17 AM Views : 625

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : ప్రముఖ విద్యావేత్త, పరిశోధకుడు డాక్టర్ ఎన్.బి. హర్షవర్ధన్ రెడ్డికి బ్రెయిన్ ఓ విజన్ సంస్థ శక్తి ఆచార్య జాతీయ అవార్డు ఇచ్చింది. శనివారం హైదరాబాదు టీ-హబ్ లో నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025లో “శక్తి ఆచార్య” అవార్డుతో సత్కరించారు. విద్యా బోధన, వికాస శిక్షణ, పరిశోధన రంగాలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక చేశారు. విఐటీ యూనివర్సిటీలో ఇటీవల పిహెచ్‌.డి పూర్తి చేసిన హర్షవర్ధన్, 10 సంవత్సరాలకు పైగా మేనేజ్ మెంటు అధ్యాపకుడు, హెచ్ ఓ డి గా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా, సేవలందిస్తున్నారు. 20 దేశాలలో పర్యటించి పలు పరిశోధనా పత్రాలు సమర్పించారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అంతర్జాతీయ కమిషన్ ఛైర్మన్ గా సేవలు అందిస్తున్నారు. యువత, ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రెయిన్ ఓ విజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. హర్షవర్ధన్ విద్యారంగంలో సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ వికాసం, ప్రయోగాత్మక బోధన విధానాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డును తన గురువులు, సహచరులు, విద్యార్థులకు అంకితం చేస్తున్నానని చెప్పారు. విద్యా రంగంలో మరింత సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: