Monday, 14 September 2026 07:01:12 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

జీవితకాల సాఫల్య పురస్కారాన్ని (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) అందుకున్న అమర రాజా వ్యవస్థాపకులు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు

తయారీ రంగంలో డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా చేసిన విశేషమైన కృషికి గానూ ఈ గుర్తింపు

Date : 14 August 2023 05:38 PM Views : 584

Famous TV - జాతీయ వార్తలు / : తిరుపతి, ఆగస్ట్ 14, 2023 : అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లాను ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం ( లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) తో సత్కరించారు. తయారీ రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ గుర్తింపు అందజేశారు. ఆగస్ట్ 11, 2023న బెంగుళూరులోని సత్యసాయి విశ్వవిద్యాలయం ముద్దనహళ్లి వద్ద జరిగిన ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ 2023 (ISF2023)లో ఈ అవార్డును ప్రదానం చేశారు. డాక్టర్ గల్లా యొక్క విశేషమైన కృషి తయారీ పరిశ్రమను ఉన్నత స్థాయికి చేర్చడమే కాకుండా దేశ వృద్ధికి గణనీయంగా దోహదపడింది.85 సంవత్సరాల వయసున్న డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు సాంకేతిక నిపుణునిగా, వ్యవస్థాపకునిగా మరియు దాత గా ప్రసిద్ధి చెందిన మహోన్నత వ్యక్తి. సామాజిక అవరోధాలను అధిగమించిన ఆయన, పరివర్తనాత్మక మార్పును తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా , డాక్టర్ గల్లా యొక్క ధృడ సంకల్పం అమర రాజా గ్రూప్‌ను అంతర్జాతీయ సంస్థగా మార్చింది, 2023 ఆర్థిక సంవత్సరంలో ఆకట్టుకునే రీతిలో $1.75 బిలియన్ల ఆదాయాన్ని సాధించింది. ఈ విజయం కారణంగానే ప్రత్యక్షంగా 16,000 మందికి పైగా ఉద్యోగులుగా ఉపాధి లభించింది మరియు అదనంగా 30,000 పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రూప్ యొక్క యొక్క ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. తయారీ రంగంలో డాక్టర్ గల్లా యొక్క అసాధారణమైన మరియు విశిష్టమైన కృషికి నిదర్శనం గా ఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు నిలుస్తుంది. అదనంగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధికారతనందించటంలో ఆయన నిబద్ధత సైతం గుర్తించబడింది మరియు గౌరవించబడింది. డాక్టర్ గల్లా యొక్క అచంచలమైన అంకితభావం వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేసింది, పరిశ్రమకు మాత్రమే కాకుండా మొత్తం దేశానికీ ప్రయోజనం చేకూర్చింది. వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు, గ్రామాభివృద్ధి, గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి CSR కార్యకలాపాలతో డాక్టర్ గల్లా సమాజం మరియు కమ్యూనిటీపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని సుమారు 200 గ్రామాల్లో సమగ్ర గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు మూడు చారిటబల్ ట్రస్టులు మార్గదర్శకత్వం వహిస్తున్నాయి. ఈ ట్రస్టులు భారీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాయి. అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించింది. వ్యవసాయ కమ్యూనిటీకి తగిన అవకాశాలను అందించడానికి, అమర రాజా గ్రూప్ కంపెనీలలో ఒకటైన గల్లా ఫుడ్స్, నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మరియు మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇవ్వడానికి 3000 మంది రైతులతో కలిసి పని చేస్తుంది. మరో గ్రూప్ కంపెనీ - అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగంలో గ్రామీణ మహిళలకు పెద్ద మొత్తంలో ఉపాధి అందిస్తోంది. మదుపరులు, కార్పొరేట్ నాయకులు, వ్యాపార సలహాదారులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలతో సహా వివిధ వాటాదారులను ఏకం చేసే వేదికగా ISF2023 నిలిచింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం యొక్క నేపథ్యం "ఇన్నోవేషన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్", గ్రామీణ ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతపై గణనీయమైన స్థాయిలో దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రదర్శనను సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ ప్రారంభించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :